19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అసూయ

By ప్రయాగ, రామకృష్ణ

బృహస్పతీ, సంవర్తుడూ అన్నదమ్ములు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. సంవర్తుడు మాట మంచితనంతో అందర్నీ ఆకర్షించేవాడు. ఆ కారణంచేత తమ్ముడిమీద బృహస్పతికి అసూయ ఏర్పడింది. తరచు సంవర్తుడికి అనేక ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉండేవాడు. వాటికి తట్టుకోలేక అతను పాపం పిచ్చివాడిలా తిరుగుతూ వుండేవాడు.

ఒకసారి ఇక్ష్వాకు వంశానికి చెందిన మరుత్తుడు ఒక పెద్దయాగం చేయాలని సంకల్పించాడు. ఆ యాగానికి ఆధ్వర్యం వహించడానికి దేవగురువు అయిన బృహస్పతిని పిలిచాడు. ఆ యాగం చేయడంవల్ల మరుత్తుడు దేవతలకంటే ఎక్కువ మహిమలు పొందుతాడనే భయంవల్ల యాగనిర్వహణకు బృహస్పతి రానని చెప్పాడు. అప్పుడు మరత్తుడు సంవర్తుణ్ణి ఆ యాగం జరిపించమని వేడుకున్నాడు. అతను ఒప్పుకున్నాడు. దీనితో బృహస్పతికి తమ్ముడి మీద మరింత ఈర్ష్య పెరిగింది. సంవర్తుడు యాగం చేయిస్తున్నాడే అన్న ఈర్ష్య మనసులో పెట్టుకోవటం వల్ల బృహస్పతి చిక్కిశల్యమైనాడు. మనిషి పాలిపోయాడు. ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వచ్చి "స్వామీ! మీరెందుకిలా రోజు రోజుకు నీరసించి చిక్కిపోతున్నారు? మీ కష్టమేమిటి?" ఆత్రంగా అడిగాడు.

బృహస్పతి దుఃఖపడుతూ "సంవర్తుడు గొప్ప యాగం చెయ్యబోతున్నాడు. అందువల్ల నాకు ఈర్ష్య, దిగులు పట్టుకున్నాయి. వాటివల్ల ఇలా మారిపోయాను" అన్నాడు.

అది విని ఇంద్రుడు ఆశ్చర్యచకితుడైనాడు. "స్వామీ! అన్నీ తెలిసిన విజ్ఞులు మీరు. దేవతలంతటివాళ్ళకు పురోహితులుగా ఉండి హితబోధలు చేస్తున్నారు. సంవర్తుడి వల్ల రాబోయే నష్టమేముంది? ఏం లేదే! అనవసరంగా ఈర్ష్య పెట్టుకుని ఎందుకు ఆరోగ్యం పాడుచేసుకుంటారు?"

నీ "శత్రువు వృద్ధిలోకి వస్తున్నాడంటే నవ్వు చూస్తూ వూరుకుంటావా? నేనూ అంతే! ఏ విధంగానైనా సరే సంవర్తుణ్ణి పడగొట్టి, ఆ యాగం నిలుపుచేసి, నా ఖేదాన్ని పోగొట్టు" అని బృహస్పతి ఇంద్రున్ణి వేడుకున్నాడు.

అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచి, "నవ్వు వెళ్ళి ఎలాగైనా సరే మరుత్తుడు చేస్తున్న యాగం నిలుపు చేసి రావాలి" అని చెప్పాడు.

అగ్నిదేవుడు బయలుదేరాడు. మరుత్తుడి దగ్గరకు పోయి దేవతాస్వరూపంతో నిలబడి "రాజా! నీవీ సంవర్తుణ్ణి వదిలిపెట్టు. అవసరమైతే నీకు పౌరోహిత్యం జరపడానికి బృహస్పతిని తీసుకువస్తాను" అన్నాడు.

ఈ మాటలు సంవర్తుడు విన్నాడు.

"అనవసరంగా జోక్యం చేసుకోకు. నాకు కోపం వస్తే నా కంటి జ్వాలలతో నిన్ను నాశనం చెయ్యగలను జాగ్రత్త!" అని అగ్నిదేవుణ్ణి హెచ్చరించాడు సంవర్తుడు.

అన్నింటినీ భస్మం చేసే అగ్నిహోత్రాన్ని కూడా బ్రహ్మచర్యం వల్ల పుట్టిన శక్తి భస్మీపటలం చేస్తుంది. బ్రహ్మచర్యం అంత గొప్పది . ఈ సంగతి అగ్నిదేవుడికి తెలుసు. భయపడి పారిపోయి జరిగిన కథంతా ఇంద్రుడికి చెప్పాడు. దేవరాజు అది నమ్మలేదు.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved