19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అష్టావక్రుడి పెళ్ళి

By ప్రయాగ, రామకృష్ణ

ఒకసారి అష్టావక్రుడు అలకానగరానికి వెళ్ళాడు. కుబేరుడు సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు.

"అయ్యా! మీ వంటి మహనీయుణ్ణి ఆరాధించగలిగాను! తరించాను!! మీకేం కావాలో చెప్పండి" అని వినయంగా అడిగాడు కుబేరుడు.

"అలకాధిపతీ! నేను బ్రహ్మచారిని. తపస్సు చేసుకుంటూ వుండే వాణ్ణి. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనే బుద్ధి పుట్టింది. వదాన్యుడే మునీంద్రుడికి సుప్రభ అనే కూతురుంది. ఆమెకు, నాకు పెళ్ళి చేయమని" అడిగాను.

"నువ్వు నా కుమార్తెకు తగినవాడవు. తప్పకుండా ఇస్తాను. కాని పెళ్ళయే లోపల ఒకసారి ఉత్తర దిక్కుకు వెళ్ళిరావాలి" అన్నాడాయన.

"ఉత్తర దిక్కుగా ఎంతదూరం వెళ్ళను?ఎక్కడికి వెళ్ళను? ఏం పని చెయ్యను?" అని అడిగాను.

"అలకానగరం దాటి, హిమాలయంలో గిరీవుని కోసం గిరిజన తపస్సు చేసిన ప్రదేశం చూసి ఇంకా ముందుకు వెళ్ళు. నీప వృక్షాలతో కూడిన అడవి కనిపిస్తుంది. అక్కడ ప్రాయంలో వున్న ఒక స్త్రీ వుంటుంది. ఆమెను చూసిరా! రాగానే పెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను" అన్నాడు వదాన్యుడు. అందుకని బయలుదేరాను. నాకు నీ వల్ల ప్రత్యేకంగా కావల్సిందేమీ లేదు, వెళ్ళొస్తాను" అన్నాడు అష్టావక్రుడు. హిమపర్వతం ఎక్కి ఈశ్వర క్రీడాస్థానం చూసి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి నీప వృక్షాలు కనిపించాయి. వాటి మధ్య బంగారు మణిమయ సౌధాలు అనేకం కనిపించాయి. వాటిలో ఒక మేడ మహోన్నతంగా మహావైభవంగా కనిపించింది. అష్టావక్రుడు అక్కడికి వెళ్ళాడు. "అమ్మాయీ! లోపలికి వెళ్ళి అష్టావక్రుడు వచ్చాడని చెప్పు" అన్నాడు గుమ్మం దగ్గరున్న పరిచారికను చూసి.

ఆమె లోపలికి వెళ్ళింది.

కాసేపటికి చందనపు బొమ్మల వంటి కన్యలు కొందరు వచ్చి వినయంగా నమస్కరించి ఆయనను లోపలికి తీసుకువెళ్ళారు. సుందరాంగులు వాళ్ళు. అయినా చలించలేదాయన. తిన్నగా వాళ్ళ వెంట అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడొక్క రత్నపర్యంకం వుంది. దానిమీద యవ్వనం, సౌందర్యం మూర్తీభవించిన ఒక స్త్రీ కూర్చుని వుంది. రత్నాభరణాలతో, తెల్లని వస్ర్తాలలో మెరిసిపోతోంది. అష్టావక్రుణ్ణి చూడగానే లేచి నిలబడిందామె.

" వీళ్ళందరూ ఎందుకిక్కడ?" అన్నాడు పరిచారికలను చూపిస్తూ. ఆమె కనుసైగతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆమె, అష్టావక్రుడు భోజనాలు చేసి హాయిగా కబుర్లాడుకోసాగారు. చీకటిపడింది.

"పొద్దుపోయింది - పడుకుందామా?" అని అడిగింది ఆమె. అంగీకరించాడు ముని.

ఇద్దరూ విడివిడి శయ్యల మీద పడుకున్నారు. కొంచెంసేపటికి ఆమె లేచి అతని దగ్గరకు వెళ్ళింది. అతనిలో ఏ చలనం లేకపోయేసరికి గట్టిగా కౌగిలించుకుని, "మగవాళ్ళు భోగపరులు. ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు స్త్రీకి వుంటుంది. కాని పురుషులకి వుండదు. కానీ, మీ వైఖరి విపరీతంగా వుంది. నా అంతట నేను వలచి దగ్గరకు వస్తే నన్ను నిరాదరిస్తారేమిటి? నన్ను, నాతోపాటు ఈ సంపదను చేపట్టి దివ్య భోగాలనుభవించండి. నేను మీదానను. మీ మాట జవదాటను. నన్ను బాధ పెట్టకండి. నన్ను మీ దానిగా చేసుకోండి" అని బతిమాలింది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved