19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అక్షయపాత్ర

By ప్రయాగ, రామకృష్ణ

అనుద్యూతంలో కూడా ఓడిపోయాక అన్నమాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు. నారచీరలూ, కృష్ణాజినమూ ధరించారు. కందమూల ఫలాలు తింటూ పన్నెండేళ్ళు అరణ్యవాసమూ, ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి సంసిద్దులయ్యారు.

ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని పాండవాగ్రజుడు తరలిపోయాడు. ఇనుపదండేల్లా భయకరంగా వన్న బాహువులు రెండూ పెద్దవిగా చాచి భీమ సేనుడు బయల్దేరాడు. ఇసుక చల్లుతూ అర్జునుడు అన్నను అనుసరించాడు. ధూళి ధూసర శరీరుడై వెళ్తున్న నకులుణ్ణి సహదేవుడు తల వంచుకుని అనుసరించాడు. జుత్తు విరబోసుకుని రోదిస్తూ ద్రౌపది వెళ్ళింది.

అలా వెళ్తున్న వాళ్ళను చూసి-

"ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే దుర్మార్గుడు. పైగా వాడికి జర, వ్యాధి, మృత్యువుల్లాగ కర్ణుడు, సైంధవుడు, శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంక ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక! పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే వుందాం" అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరుగెత్తారు.

"నాయనలారా! సవతి సోదరుల కపటంవల్ల సర్వమూ పోగొట్టుకున్నాం. కందమూలాలు తింటూ అరణ్యవాసం చేయబోతున్నాం. మాతోపాటు మీరు కూడా కష్టపడటమెందుకు? మా మీద అనుగ్రహముంచి వెనక్కి వెళ్ళిపోండి" అని పాండవులు బ్రతిమాలారు.

"ధర్మరాజా! నీవున్న అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించినవాళ్ళు శత్రువులైనా విడిచిపెట్టకూడదంటారు. అలాంటప్పుడు నీమీద భక్తి కలిగి నిన్నాశ్రయించిన మమ్మల్ని విడిచిపెట్టడం మీకు భావ్యమా?" అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు విచారగ్రస్తుడయ్యాడు. అప్పుడే శౌనక మహాముని అక్కడకు వచ్చాడు.

"మహాత్మా! అతిథులను, అభాగతులనూ అర్చించడం గృహస్థులకు ధర్మమని మీకు తెలుసుకదా! అలాంటిది ఆశ్రయించి వచ్చిన వీరిని ఎలా ఉపేక్షించను?" అని ధర్మరాజు సంశయం వెల్లడించారు.

"నాయనా! తపస్సు వల్ల సాధించరానిది ఏదీ లేదు. అందుచేత నువ్వు నియమవంతుడవై తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో" అని శౌనకుడు ధర్మరాజుకు తగిన సందేశ మిచ్చి ప్రయాణమయ్యాడు.

"శౌనక మహాముని చెప్పినట్లు తపస్సు చెయ్యాలి! కాని ఎవరి నుద్దేశించి తపస్సు చెయ్యాలి?" ఇంకో ధర్మసందేహం వచ్చింది ధర్మరాజుకు. వెంటనే ధౌమ్యులవారికీ సంగతి చెప్పాడు.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved