17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సంక్రాంతి మరియు ధనుర్మాస విశేషాలు

మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకరసంక్రాంతి అంటారు. ముగ్గులు,గొబ్బిళ్ళు,డూడూ బసవన్న,కొత్త అల్లుళ్ళు,కొత్త బట్టలు,పిండి వంటలు,పాడి పంటల తో ఇది తెలుగు వారి పెద్ద పండుగ.మకర సంక్రమణమునకి వెనుకటి ముప్పై(30) రోజులని ధనుర్మాసము అంటారు.

ఆంధ్రుల పండుగ లలో సంక్రాంతి కి ఒక ప్రత్యేక స్ధానముంది. ఇది పెద్ద పండుగ గా భావిస్తారు. ఆంధ్రుల పండుగలన్నీ పంటలతో కూడుకున్నవే. అయినా దీనిని "పెద్ద పండుగ", "పంటల పండుగ "గా భావిస్తారు. వ్యవసాయదారులు తాము చెమటోడ్చి పండించుకున్న పంటను ఇంటికి తెచ్చి గాదె లలోను, గరిసెలలోను నింపుకొని ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. కూతుళ్ళను, అల్లుళ్ళను ఈ పండుగకు ఇంటికి పిలుస్తారు. కొత్త అల్లుళ్ళకు ప్రత్యేక శ్రద్దతో మర్యాదలు చేస్తారు. ఇంటిలోని వారందరుకు కొత్త బట్టలు కొంటారు. అల్లుళ్ళకు ప్రత్యేక బహుమతులు యిస్తారు.

మార్గశిర, పుష్య మాసములు హేమంత ఋతువు. బాగా చలి రోజులు. ఈ సంక్రాంతి పండుగ పుష్యమాసం (జనవరి నెల) లో వస్తుంది ప్రతి సంవత్సరంలోనూ. ఈ మాసం లో మంచు పొగలు భూమిని కప్పేస్తుంటాయి. చలి గజగజ లాడిస్తూంటుంది. అయినప్పటి కి యిళ్ళలోని కన్నెపిల్లలు, ఆడవారు యింటి మందు కలాపి చల్లి తెల్ల టి ముగ్గు పిండితో పెద్ద పెద్ద రంగవల్లులను (ముగ్గులను) వేస్తారు. చలి మంటల వెలుగులలో ముత్యాల ముగ్గులతో పల్లెలు శోభాయమానంగా వుంటాయి.

సూర్యుడు ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణము లేక సంక్రాంతి అంటారు. ఇలా సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ నే ఉంటాడు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకరసంక్రాంతి అంటారు. ఈ నాటి నుండి సూర్యుని వేడిలోని తీక్షణ రోజు రోజుకి పెరుగుతూ వుంటుంది.

ఈ మకర సంక్రమణానికి ఒక విశిష్టత వుంది. సూర్యుడు మకర సంక్రమణం లోకి చేరేటప్పుడు ప్రకృతి పులకించి తనవిలాస వైభవాన్ని చూపుతుంధి. ప్రకృతి విలాసవైభవ విశిష్ట రూపమే మకర సంక్రాంతి.

తొలకరిలో మొలకెత్తిన జొన్న, ఆరిక, చామ, కొర్ర, నువ్వులు, పెసర, కంది శనగ, మొదలగు మెట్ట పంటలు, మాగాణి పంటలయిన రాగి, వరి, కూరగాయలు, ...మార్గశిర మాసంలో ఏపుగా కాపుకు వచ్చి, పుష్యమాసంలో కోతలకు సిద్ధమవుతాయి. ఈ విధంగా ఏపుగా పండిన పంటలతో పొలాలన్నీ ఎటు చూసినా కళకళలాడుతూ కనిపిస్తాయి. కోతకు సిద్ధమయిన వరిచేళ్లు, బంతి - చేమంతులు పల్లె పల్లెకు కొత్త అందాన్ని యిస్తూ వుంటాయి. రైతులు కోతలు కానిచ్చి పంటను యిళ్ళకు చేరుస్తారు.

పేజి   1 |   23 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved