17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

దసరా

దేవి శరన్నవరాత్రులలో జగన్మాత అయిన అమ్మను మహాలక్ష్మీ, గాయత్రి, లలిత, అన్నపూర్ణ, బాలా త్రిపుర సుందరి, శాఖాంబరి, సరస్వతి, దుర్గ, మహిషాసుర మర్ధనిగా వివిధ పేర్లతో వివిధ అలంకారాలతో పూజిస్తారు.ఈ తొమ్మది రోజులు లలితా సహస్రనామ పారాయణ, లలితా అష్టోత్తరములతో అమ్మను

దసరా పండుగ ఆశ్వయుజ మాసం లో వస్తుంది. వాడుక భాషలో దీన్ని ఆశ్వీజమాసం అంటారు. వర్షాకాలానికి, చలికాలానికి మధ్య ఈ పండుగ వస్తుంది.

ఇది మూడు రోజుల పండుగ.

1. మొదటి రోజు దుర్గాష్టమి

2. రెండవ రోజు మహా నవమి (వాడుక లో మహార్నవమి)

3. మూడవ రోజు విజయదశమి .

దుర్గాష్టమి: దుర్గ - అష్టమి.

ఈ రోజు స్త్రీలు తల స్నానము చేసి దేవిని పూజిస్తారు. లలితా సహస్ర నామ పారాయణ; లలితా అష్టోత్తరముతో పూజిస్తారు. పులిహోర, పరమాన్నం నివేదన చేస్తారు.

మహర్నవమి : మహా నవమి

ఈ రోజు కూడ స్త్రీలు దేవీ మాతను లలితా సహస్రనామ పారాయణ లలితా అష్టోత్తరంతో పూజిస్తారు. గారెలు, ఆవడలు నివేదిస్తారు.

విజయదశమి:

ఈరోజు సర్వజనులకు పండుగ. పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, అందరూ తల స్నానము చేస్తారు. "అమ్మ"ను పూజిస్తారు. రకరకాల పిండి వంటల (పంచ భక్ష్య పరమాన్నాలు) తో నైవేద్యం పెడ్తారు.

సాయంత్రం క్రొత్త బట్టలు కట్టుకుంటారు. గుడికి వెళతారు. దగ్గరిలో ఉండే జమ్మి చెట్టు (శమీ వృక్షం) ను ప్రార్ధించి తమ పేరు గోత్ర ముల పేర్లు ఒక కాగితము మీద వ్రాసి జమ్మి చెట్టు మీద వుంచుతారు. జమ్మి ఆకులను కోసికొని ఇంటికి తిరిగి వస్తారు. కొంతమంది జమ్మి చెట్టు మొదలు లో వుండే మట్టిని తీసుకుని ఇంటికి వస్తారు.

పేజి   1 |   23 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved