19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

గోధుమ

ప్రపంచ ఆహార విపణిలో గోధుమది అగ్రస్ధానం. ప్రపంచంలో వరి తరువాత ఎక్కువగా వాడబడుతున్న ఆహారధాన్యం గోధుమలే. 550 మి.టన్నుల పై చిలుకు గోధుమలు సాలీన వాడకం ఉంది. ఇందులో 2/3 వంతు ఆహారానికి, 1/6 వంతు పశువుల దాణాగాను మిగిలినవి విత్తనాలు తదితరాలకి వాడబడుతున్నాయి.

1949-1978 మధ్య కాలంలో ప్రపంచ గోధుమ సాగు 3.3% పెరిగింది. 1960 కాలం నాటి హరిత విప్లవం, పెరిగిన సాగు విస్తీర్ణం, కొత్త అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, పురుగుమందుల వాడకం అధికమవడం దీనికి దోహదబడ్డాయి.

గోధుమ నేడు 80 దేశాలలో 232 మి.హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సరాసరి ఉత్పత్తి 1664 కి.గ్రా / హె. సాధించగలిగాము. ఉష్టమండలాలలోని మధ్య అక్షాంశ గడ్డి మైదానాలలో ముఖ్యంగా పండిస్తారు.

ముఖ్యంగా పండించే ప్రాంతాలు

పూర్వ సోవియట్ రష్యా అమెరికా
కెనడా చైనా
ఆస్ట్రేలియా అర్జెంటీనా
యూరప్

గోధుమ రకాలు

  గోధుమలో ముఖ్య రకాలు
 1. వసంతకాల గరుకు ఎరుపు గోధుమ (Hard Red Spring Wheat)
 2. శీతాకాల గరుకు ఎరుపు గోధుమ (Hard Red winter Wheat)
 3. శీతాకాల మృదువైన ఎరుపు గోధుమ (Soft Wheat)
 4. మృదువైన తెల్లని గోధుమ (White Wheat)
 5. దూరమ్ (డ్యూరమ్) గోధుమ (Durum Wheat)

గరుకు ఎరుపు గోధుమ రకాలు మేలు రకం పిండి తయారీకి వాడతారు. ఇది బ్రెడ్, బన్ను తయారీకి అనుకూలమైనది. ఈ గోధుమలలో ప్రోటీన్ శాతం ఎక్కువ.

శీతాకాల గరుకు ఎరుపు గోధుమ రకం అతి శీతల ప్రదేశాలలో ఎక్కువగా పండిస్తారు.

మృదువైన ఎరుపు గోధుమతో వచ్చే పిండి కేకులు, ఇతర బేకరీ పదార్ధాల తయారీకి వినియోగిస్తారు. ఈ రకం గోధుమ అత్యధికంగా పండించబడుతోంది. ఇందులో ప్రోటీన్ శాతం తక్కువ.

తెల్ల గోధుమలు ఆసియా దేశాలలో, అమెరికా రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఈ గోధుమల పిండి కేకులు, సిరియల్స (breakfast cereals - అటుకులు) తయారీకి వాడతారు.

దురమ్ (డ్యూరమ్) గోధుమలు అన్నిటికన్నా అత్యధిక ప్రోటీన్ శాతం కలిగి ఉన్నాయి. వీటి నుండి బంగారు వన్నె కల సేమెలీన్ తయారు చేయబడుతుంది. దీని నుంచే పాస్తాలు, సేమ్యా నూడిల్సు తయారు చేస్తారు.

అత్యధికంగా ఉత్పత్తి గల దేశాలు పూర్వ సోవియట్ రష్యా, అమెరికా, చైనా
అత్యధిక ఉత్పాదకత గల దేశాలు బెల్జియం, హాలెండ్, ఇటలీ, అమెరికా, ఇండియా

భారతదేశంలో గోధుమ

భారతదేశంలోని వ్యవసాయ భూమిలో 14% విస్తీర్ణంలో గోధుమ సాగు చేయబడుతుంది. 70% గోధుమ, సాగునీటి ఆధారంగా పండిస్తున్నారు.

పండించే ప్రాంతాలు

సాధారణ గోధుమ గంగా సింధు నది మైదానాలలో, దురమ్ (డ్యురమ్) గోధుమ వాయువ్య భారతదేశంలో, భారత ద్వీపకల్పంలో (Peninsular India) ఎమర్ గోధుమలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో పండిస్తున్నారు.

అధిక విస్తీర్ణం సాగులో వున్న రాష్ట్రాలు
 1. ఉత్తరప్రదేశ్
 2. మధ్యప్రదేశ్
 3. పంజాబ్
 4. రాజస్తాన్
 5. బీహార్
 6. హర్యానా
అధిక ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు
 1. ఉత్తరప్రదేశ్
 2. పంజాబ్
 3. హర్యానా
 4. బీహార్
అత్యధిక ఉత్పాదకత ఉన్న రాష్ట్రాలు
 1. పంజాబ్
 2. పశ్చిమబెంగాల్
 3. రాజస్తాన్
 4. ఉత్తరప్రదేశ్

గోధుమ కావాలిసిన వాతావరణం, భూమి

విత్తు సమయంలో కోత సమయంలో
ఉష్ణోగ్రత 15 -20 సెం.గ్రే 25-28 సెం.గ్రే
వర్షపాతం 50-100 సెం.మీ. పొడిగా (అనార్ధ్ర)

భూమి: ఒండ్రుమట్టి, లోయ్ వృత్తికలు, సిల్టు నేలలు, బ్లాక్ చెర్నొజెమ్.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved