19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఇది తెలుగు గడ్డ

By సి, నారాయణ రెడ్డి

ఇది తెలుగు గడ్డ గాం 
డ్రించు పిల్లి కూతొద్దురా 

ఇఒ లెనుగు పనుకు, కురి 
సే తేనె చినుకు - ఈ 
పలుకెపుడు నీరు గారొద్దురా - తీపి 
చిలికితేనే చెవికి ముద్దురా

ఇది తెలుగు తెలివి; రగి 
లే నిప్పుకొనిమి - ఇది 
ఎప్పుడూ మండుతుండాలిరా - బూది 
కప్పినా ఉరుముతుండాలిరా

ఇది తెలుగు కీర్తి; కది 
లే రణమూర్తి - ఇది 
సాగరాల్ దాటి పోయిందిరా- న 
యాగరాల్ మీటి వచ్చిందిరా

ఇది తెలుగు నాడి; ఆ
డే కూ చిపూడి; ఇది 
పేరిణిగ పదము తొక్కాలిరా; నవ
ప్రేరణకు లయలు కట్టాలిరా

ఇది తెలుగు గీతి; త్యా
గయ గళ జ్యొతి - ఇది 
మరి మరీ ప్రజ్వలించాలిరా! బాల
మురళులై ప్రసరించాలిరా! 

ఇది తెలుగు ప్రతిన! ఒక 
టే దీని తపన! ఈ రాష్ట్రం 
పురోగమించాలిరా! ప్రజల 
రాజ్యం త్రివిక్రమించాలిరా

పలుకులో పదునులో 
తెలివిలో కలిమిలో 
గీతిలో రీతిలో 
కీర్తిలో స్ఫుర్తిలో 
కొస కొమ్మలను ఒడిసి పట్టాలిరా 
కుళ్ళు బుద్దులు పాతి పెట్టాలిరా!

		డా|| సి. నారాయణ రెడ్డి

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved