22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు తల్లీ!

By పిల్లలమఱ్ఱి, వేంకట హనుమంతరావు

తేనె పలుకుల తెలుగు తల్లీ!
రవల వెలుగుల తెలుగు తల్లీ!
తేజునెరపిన తెలుగు తల్లీ!
ఆశిషమ్ముల నిమ్ము తల్లీ!!

శాత వాహన శకములోపల
శాంతి పాఠము నేర్పితమ్మా!

పూర్వ వేంగి యుగము లోపల
పుణ్య కవితల జెప్పితమ్మా!

కాకతీయుల కలమందూ
ఖడ్గ పాండితి గఱపితమ్మా!

రెడ్డి రాయల రాజ్యమందూ
లలిత కళను దేల్చితమ్మా
గాంధీ దేవుని యుగము లోపల
సదయ హృదయుల గ్రాంచితమ్మా

సర్వమానవ సమత గూర్పగ
భారతాంబకు యశము నింపగ
కదలి రమ్మో తెలుగు తల్లీ!
ప్రోవ రమ్మో తెలుగు తల్లీ!

		కీ.శే. పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved