22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు తల్లి పిలుస్తోంది

By వై, వెంకటరత్నం

తెలుగు తల్లి పిలుస్తోంది
తెలుగు వారంతా ఏకం కండని 
ఐక్యతతో మెలగండని
జాతి పేరు నిలబెత్తండ్ని
సంస్కృతి నలుమూలలా వెదజల్లండని
తెలుగు ఖ్యాతి దేశదేశాలా చాటండని
తెలుగు తల్లి పిలుస్తోంది

ఆంధ్రావనికి నిత్యం పండుగ కావాలని 
ఆకాంక్షిస్తున్నది తెలుగు ప్రజానీకం 
గోదావరి, కృష్ణానది తరంగాలలో 
మన సంస్కృతి ప్రతిబింబించాలని 
తెలుగు సుమ సౌరభంతో దశదిశలు
పరిమళించాలని సస్య శ్యామల 
దేశమనే పేరు సార్ధకం కావాలని 
తెలుగు తల్లి కోరుకుంటుంది

తెలుగు జాతి ప్రగతి సాధించాలంటే
తెల్లుగు నాట క్రంతి విరజిమ్మలంటే
ఆంధ్రుడు కాడు కేవలం ఆరంభశూరుడు 
కడవరకు పోరాడి గెల్వగల ధీరుడు 
అని లోకానికి చాటి చెప్పమని 
ఎలుగెత్తి పిలుస్తోంది తెలుగు తల్లి

గతించనున్న పార్ధివ నామ సంవత్సరంలోని
విజయాలకై  సన్నద్దం కమ్మని దీవిస్తూ 
తెలుగు తల్లి పిలుస్తోంది.

		వై.వి. వెంకటరత్నం

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved