22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు ప్రతిభ

By వుమ్మ, నారాయణరెడ్డి

1 రైతు బిడ్డలగడ్డ - ధాన్యాల అడ్డ
   తెలుగు వారీ భూమి - వెలుగు వెలుగు   ||చెయెత్తి||
2 పంట భూముల - పచ్చదనం
  కోయిలమ్మల - మధురగీతం 	 ||చెయెత్తి||
3 పొలకమంతాధాన్య రాసులు
  ఆడవారి వంటినిడా - కాముల పేరులు	 ||చెయెత్తి||
4 వంటింట్లో వంకాయల - ఘుమ ఘుమలు
  ఇంటిముందు ముగ్గుల - తళతళలు	 ||చెయెత్తి||
5 పండుగ లొచ్చినా - పచ్చాలు వచ్చినా
 అల్ళుళ్ళ మర్యాద - ఆడపడతుల రాక
6 దేశభాషలందు - తెలుగు లెస్సాయంచు
  శ్రీ కృష్ణరాయలు - చిరునవ్వుతో జెప్పె	 ||చెయెత్తి||
7 తెలుగుదనము గొప్ప - వెలుగు దనము
  రౌద్ర భూముల దిట్ట - పౌరుషాలకు పుట్ట ||చెయెత్తి||	
8 రణము జేసిన రాణి - రాణి రుద్రమదేవి -
  కదన కౌశలమందు - బాలచంద్రుడు గొప్ప ||చెయెత్తి||
9 గుండ్లను యెదిరించె - టంగుటూరీ వారు
  స్వాతంత్ర్య యోధుడు - వావిలాల గారు   ||చెయెత్తి||	
10నిజామును యెదిరించిన - తెలంగాణం
  తెల్లమూకల చెండిన - ఆంధ్రం	   ||చెయెత్తి||
11సాహితీవేత్తల సౌరభాలు
   తెలుగింట బుట్టిన - కవిరాజు	   ||చెయెత్తి||
12ఆదికబుల - అలంకారలు 
  నేతికవుల - చిలకరింపులు	 ||చెయెత్తి||
13గురజాడవారి - అడుగుజాడల
  రాయప్రోలువారి - రసమయము	 ||చెయెత్తి||
14చేయెత్తి జేకొట్టు - తెలుగోడా
  నిలువెల్ల ఘనకీర్తి - గలవాడా	 ||చెయెత్తి||

		-జనకవి వుమ్మ నారాయణ రెడ్డి

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved