22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సర్ ఆర్ధర్ కాటన్

By వై, వెంకటరత్నం

మానవ జాతి వికాసానికి సృష్టి అందించిన వరప్రసాదమే సర్ ఆర్ధ్ కాటన్. మదరాసు రాష్ట్రంలో వారు అమలు చేసిన నీటి పారుదల పనులు అద్వితీయమైన విజయాలు సాధించాయి. సర్ ఆర్ధర్ కాటన్ దూరదృష్టి, సునిశిత మేధాశక్తి అమోఘం, అద్వితీయం. దక్షిణ భారతావనిలో ఎన్నో నీటి పారుదల రూపకల్పన చేసిన అన్న దాత సర్ ఆర్ధర్ కాటన్ ను ప్రభుత్వం సముచితంగా అనేక బిరుదులతో సన్మానించింది.

1803 మే 15వ తేది కాటన్ జన్మించారు. కుటుంబంలో అందరికంటే తల్లి వ్యక్తిత్వ ప్రభావం ఆయనపై పడింది. కాటన్ చిన్నతనం నుంచి మనో వికాసానికి సాహసానికి, ధైర్యానికి, దీక్షకు మారుపేరు. తల్లి ఇచ్చిన శిక్షణ కాటన్ కి ఎంతో ఉపక రించింది. 15 ఏళ్ళ ప్రాయంలో ఇండియాకు వెళ్ళడానికి స్కాలర్ షిప్ పొందారు. 1819 సం।। నికి ఆర్ధర్ కాటన్ జాగ్రత్తగా చదువుకొని మంచి క్రమశిక్షణతో మెలిగి అది స్కాంబి లో చక్కగా విద్యనభ్యసించి ఏ పరీక్షకు హాజరు కాకుండానే రాయల్ ఇంజనీర్ సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించారు. 1821 లో 18 సం।। ప్రాయంలో ఇండియాలో ఉద్యోగంలో నియమింపబడ్డారు. 1822 సం।।లో అనేక జిల్లాల్లోని చెరువు మరమత్తు పనులను పర్యవేక్షించే పనిని అప్పగించారు. 1824 సం।। వరకు ఈవిధంగా పనిచేసి మద్రాసు దక్షిణాన కొన్ని మైళ్ళ దూరంతో వున్న మిలిటరీ స్ధావరమైన ధామస్ మౌంట్ దగ్గర భవనాలు నిర్మించడానికి నియమించబడిరి. ఎనిమిదేళ్ళ సర్వీసు అయిన తర్వాత కెప్టెన్ ర్యాంక్ కు ఎదగారు. ఆయల కృషి వల్ల తంజావూరు జిల్లాలోని అనే నిర్మాణపు పనులు పూర్తి అయి రాష్టంతో సంపన్న జిల్లా గా మారింది.

1828 - 29 సం।। లలో అనేక ప్రణాళికలకు రూపకల్పన చేశారు. తరువాత అనారోగ్బ కారణాలవల్ల ఇంగ్లాండు తిరిగి వెళ్ళనలసి వచ్చింద. 1832 లో తిరిగి ఉద్యోగంలో ప్రవేశించారు. శక్తికి మించిన శ్రమ చేయడం వల్ల తరచు అనారోగ్యానికి గురయ్యేవారు. ఈసారి ఆస్ట్రేలియాకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వుండగా ఒక ధనవంతుని కుమార్తె ఎలిజబెత్ ని ప్రేమించి వివాహమాడారి. 1841 సం।। లో అక్టోబరు 10వ తేదీన వీరి వివాహం జరిగింది. తరువాత తిరిగి టాస్మోనియా వెళ్ళారు. ఆ సమయంలో రాజమండ్రి జిల్లా పరిస్తితి అద్వాహ్నంగా ఉండేది. గోదావరి తో పారే నీటిని వినియోగించి ఆ భూములను సస్యశ్యామలం చేయటం జరిగింది. అప్పటినుంచీ రాజమండ్రి జిల్లా గోదావరి జిల్లా గా పేరు గాంచింది. గోదావరి నదిపై 12 లక్షల ఎకరాల సాగుకు ఉపయోగపడే ఒక ఆనకట్ట నిర్మించబడింది. ఈ ఆనకట నిర్మాణం ద్వారా ఆయన కన్న కలలు నిజమయ్యాయి. కాల్వలు తరువాత కాల్వలు, పిల్లకాత్వతు, పంట కాల్వలు త్రవ్వడం జరిగింది. 1841 నుండి 45 సం।।లు నీటి పారుదల పధకాల అమలుకై ఆయన నిర్విరామ కృషి చేశారు. 1881 వ సం।।లో ప్రచురించిన ``వీలున్నచోట నీటి పారుదలకు కాల్వలను ఏర్పాటు చేయాలి. వర్షపు నీరు, బావి నీరు, ఇతర విధానాల ద్వారా లభించే నీటి కన్నా భూమిని సారవంతం చేసే ఎరువు గల్గిన నీటుని పొలాలలకు కాల్వుల దారా పారించవచ్చును. ``ఒక చోటినుండి ఇంకొక చోటికి ఉత్పత్తులను కారు చౌక ఎగుమతి చేయడానికి నీటి కంటే మరొక ఉత్తమ సాధనం లేదు. ఆ కారణంగా నీటి పారుదల కాల్వలను స్టీమ్ బోట్ లు తిరగడానికి వాలుగా నౌకాయాన సౌకర్యాలు కల్పించారు. ధవళేశ్వరం ఆలకట్ట నిర్మాణంలో సర్ ఆర్ధర్ కాటన్ చూపిన ప్రతి భాపాటవాలు నేటికి మరువలేనివి. ఈ బ్యారేజి నిర్మాణం వల్ల గోదావరి డెల్టాలో 13,75,000 టన్నులు, ధాన్యము, 16,38,000 చెరుకు, 34,000 టన్నుల పప్పు ధాన్యము, చిరుధాన్యాలు ఉత్పత్తి ఆవుతున్నాయి. ఈ వ్యారేజి నిఢిని 3.6. కి.మీ. దేశంతో కెల్ల అతి పెద్దదైల ధవళేశ్వరం బ్యారేజి సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజిగా పిలువ బడుతున్నది. ఇండియాలో పబ్లిక్ వర్క్స్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాసారు. మానవ జాతి మహోదయానికి ఇంజనీరుగా రచయితగా ఆలోచలా పరులుగా శ్రీ కాటన్ చేసిన కృషి చిరస్మరణీయమైంది. ప్రజలను విఙ్ఞాన వంతులుగా చేయడానికి అనేక రచనలను చేశారు. వానితో ముఖ్యమైనవి

 • ఉప్పు పన్ను పేదవానిపై సంపద పన్ను
 • తుంగ భద్ర పనులు
 • ఇంగ్లాండు అంతరంగం
 • కాన్ సూరిస్ సంప్రదింపులు
 • మద్రాస్ పబ్లిక్ వర్క్స్
 • నల్లమందు ఆదాయం
 • సజీవ అధ్యయనం
 • ఆర్ధిక వ్యవస్ధ
 • కరువులను నివారించడం ఎలా
 • మాంచెస్టర్ లో జరిగే అర్జాతీయ కాంగ్రెసు చర్చనీయాంశాలు.
 • విమర్శలు - సమాధానాలు
 • టెహారున్ లో నౌకాయానం

ఈ విధంగా ఆయన పేదరిక నిర్మూలనకు కరువు నివారణకు అనేక నీటి పధకాలు అమలు చేసి చరిత్ర ప్రసిద్ధుడైయాడు. ఎన్ని పనులు చేసినా ఆయన సామాన్యుడే. ధర్మాన్ని నిర్వర్తించాడు. అభివృద్ధే ఆయన ఆదర్శం. అందుకే ఆయనను అన్నదాతగా పిలిచేవారు. ప్రజల హృదయాలలో శాశ్విత స్ధానాన్ని ఏర్పరచుకొని 1899 జులై 24వ తేది పరమపదించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved