19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మహామనిషి భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్

By వై, వెంకటరత్నం

జవహర్ లాల్ నెహూ, గాంధీజీల సమకాలీనులైన డా।। సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలోని ప్రముఖుల్లో ఒకరు. 1962 మేలో అత్యున్నతమైన రాష్ర్టపతి పదవికి డా।। సర్వేపల్లి ఎన్నికవడంతో ఆయన ఉన్నత స్ధాయికి ఎదిగినట్లయింది. దక్షిణ భారత దేశంలోని సాధారణ కుటుంబములో జన్మించిన రాధాకృష్ణ న్ క్రమ క్రమంగా రాజకీయ నాయకుడుగా, మేధావిగా ఎదిగినారు. తత్వవేత్తగా, విద్యావేత్తగా, పేరుగాంచిన రాధాకృష్ణన్ దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో ఉపాధ్యాయునిగా, ఉపన్యాసకునిగా, వక్తగా ప్రొఫెసర్ గా పనిచేశారు. మద్రాసు సమీపములో ఉన్న ప్రముఖ యాత్రా స్ధలమైన తిరుత్తణి అనే గ్రామములో 1908 సంవత్సరం సెప్టెంబరు 5న డా।। రాధాకృష్ణన్ జన్మించారు. డా।। రాధాకృష్ణన్ తన 18 వ ఏట శివకామమ్మును వివాహమాడినాడు.

తన జీవిత కాలం మొత్తం శ్రీ రాధాకృష్ణన్ ని ఉన్నత పదవులు ఒకదాని వెంట ఒకటి వరించాయి. పదవులకు ఆయన వన్నె తెచ్చి సమర్ధవంతంగా నిర్వహించారు. తత్వ శాస్త్రంలో అధ్యాపకునిగా, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వ శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, మైసూర్ విశ్వ విద్యాలయంలో తత్వ శాస్త్రంలో ప్రొఫెసర్ గా , ఇదే పదవి తిరిగి ఆంధ్ర విశ్వ విద్యాలయం తూర్పు దేశమతాలు, నీతులు అనే భాగానికి ప్రొఫెసర్ గా పని చేసి, బనారస్ విశ్వ విద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా (1942)లో పని చేశారు. శ్రీ రాధాకృష్ణన్ చేపట్టిన ఇతర ఉన్నత పదవులు యునెస్కో సమావేశాలకు భారతీయ విద్యా కమీషన్ (1948) కు నాయకత్వం, యునెస్కో కార్యనిర్వాహక కమిటి ఛైర్మన్ (1948), యునెస్కో అధ్యక్షులు (1952) గా వివిధ పదవులు వారు నిర్వహించారు. ఆధునిక యుగంలో రచయితలలో డా।। రాధాకృష్ణన్ అగ్రగణ్యులు. తత్వ శాస్త్రం, నీతి శాస్త్రం, విద్యా సామాజిక సాంస్కృతిక రంగాలలో పలు విషయాలపై తన రచనలు గావించారు. వీరి రచనల్లో ప్రముఖమైనవి... ఫిలాసఫి ఆఫ్ లైఫ్ (1932) ఈస్టర్న్ రిలీజియన్ అండ్ వెస్టర్న్ ధాట్, ఇండియన్ ఫిలాసఫి (రెండు భాగాలు) మొ।। ఉన్నాయి. ప్రపంచంలోని తత్వ శాస్త్ర వేత్తల్లో డా।। రాధాకృష్ణన్ ప్రముఖంగా నిలిచారు. ప్రంచ ప్రఖ్యాత తత్వవేత్తలు సభ్యులుగా ఉన్న లైబ్రరీ ఆఫ్ లీవింగ్ ఫీలాసఫర్స్ 1952లో ఆయనపై ది ఫిలాసఫీ ఆఫ్ రాధాకృష్ణన్ అనే గ్రంధం వెలువరించినది. ఈ గ్రంధంలో డా।। రాధాకృష్ణన్ తాత్విక ఉపన్యాసాలు ఆయన వివరణాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం వారిని భారత రత్న తో గౌరవించింది. 1975 లో టెంపుల్ టన్ బహుమతి ద్వారా లభించిల 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్ ఫర్ఢ్ విశ్వ నిద్యాలయంలో భారతీయ సంస్కృతి పై ప్రయోగాలు ఏర్పాటు చేసేందుకు విరాళంగా ఇచ్చారు. రాధాకృష్ణన్ గారు డా।। కె. యం. మూన్షీ గారితో కల్సి భారతీయ విద్యాభవన్ స్ధాపించారు. మహా మేధావిగా గొప్ప వ్యక్తిగా గొప్ప గ్రంధ కర్తగా, తత్వ వేత్తగా ప్రపంచ దేశాల మన్నన లందుకొన్న డా।। రాధాకృష్ణన్ 1967లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తరువాత చివరి రోజు వరకు మద్రాసులోని తమ నివాసంలో తాత్విక చింతన చేస్తూ 17 -4- 1975న పరమ పదించారు. స్వతంత్ర భారత దేశ మొదటి ఉపరాష్ట్ర పతిగా పదేళ్లు, రాష్ట్రపతిగా ఐదేళ్లు డా।। రాధాకృష్ణన్ పని చేసి దేశ ప్రజల గౌరవ మన్ననలేగాక, యావత్ప్రపంచపు మేధావులందరి ప్రశంసలు కూడా పొందారు. తన అఖండ మేధస్సుతో భారత దేశం లోనే కాదు ప్రపంచ మంతటినిలోనే ఆరు దశాబ్దాల పాటు మణి దీపంగా వెలిగిన మహా మనీషి డా।। సర్వేపల్లి రాధాకృష్ణన్ . వక్తృత్వ సౌరభ సౌర్య విషయంలో ఆయన మల్లె పువ్వుతో పోల్చదగినవారు. ఆచార్యునిగా ఆయనను గుర్తించిన భారత దేశం , రాధా కృష్ణన్ జన్మ దినమును ఉపాధ్యాయ దినంగా ప్రతి ఏటా జరుపుకుంటు న్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved