17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కృష్ణదేవరాయుని ఆముక్తమాల్యద - కథాసారం

గోదాదేవి ప్రేమ

విష్ను చిత్తుడు ఒకనాడు తులసీవనములో తిరుగుచుండగా, వనములోని వున్న బావి అరుగు మీద ఒక పసిపిల్లను చూశాడు. పిల్లలు లేని విష్ణుచిత్తుడు అందమైన పాపను చూసి తెగ మురిసిపోయాడు సంతోషంతో ఆ పాపను తెచ్చి భార్యకిచ్చాడు వారిద్దరూ ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకునసాగిరి.

ఆ పిల్ల పెరిగి పెద్దదయ్యెను. తోటి పిల్లలు తోడయ్యారు. ఆ మె చెలికెత్తెలునాగకన్యలు. ఒకామె పేరు మరాళిక. మరియెకయామె మేకావళి. ఇంకొక యామె పేరు హరిణి మరొకరు మనొజ్ఞ ఇంకొక బాల స్రగ్విణి. ఆమె పేరు గోదాదేవి. ఆమె ఎవరోకాదు సాక్షాత్తు భూదేవియే. ఆమె చిత్తము ఎప్పుడూ శ్రీమహావిష్ణువునందే నిలిచియండేది. చెలులతో ఆడుటప్పుడు కూడా భగవన్నామస్మరణే. వారి ఆటలు, పాటలు మాటలు అన్నీ భగవంతుని గురించియే.

గోదాదేవి ఉదయమే లేస్తుంది. స్నానాదులు పూర్తిచేసుకుని చెంగల్వపూలు తీసుకు స్వామి ఆలయానికి వెడుతుంది. ఆలయంలో ముగ్గులు పెడుతుంది. స్వామిని పూలమాలలతో అలంకరిస్తుంది. నైవేద్యము చేసి యింటికి వస్తుంది. యింట కూడా భగవంతుని చింతలోనే ఉంటుంది. క్రమంగా ఆమెకు స్వామిపై అనురాగము అధికమయింది. స్వామి చింతనతో పాటలు పాడుతూ వీణ మీటుతూ కూర్చుంటూ పడుకుంటూ స్వామియందు రక్తితో మన్మధతాపానికి గురయింది. తండ్రి దీనిని గుర్తించాడు. ఈ పిల్లయేమీ? దేవాలయములోని స్వామిని ప్రేమించుటయేమీ! ఇది ఎట్లు జరుగును? అని కలత చెందాడు. చివరకు దేవాలయములోని దేవునికే తన మనసులోని మాటను దాచి విన్నవించుకుందామనుకున్నాడు. సంకోచము అడ్డుతగిలింది.నాకూతురు నీయందే మనసు నిలుపుకుంది అని చెప్పకుండా "నాయన! తండ్రి! పిల్ల నానాటికి చిక్కిపోతున్నది. ఆహార విహారాలు లేవు. ఏమి దాని అవస్థ? అన్నాడు. అతని చాదస్తమును గమనించి స్వామి చిరునవ్వుతో మాలదాసరి కథను చెప్పెను.

పేజి   1234 |   567 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved