17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కృష్ణదేవరాయుని ఆముక్తమాల్యద - కథాసారం

ఖాండిక్య - కేళిద్వజులు కథ

అది ఏమిటంటే:

ఖాండక్యడు- కేళిద్వజులు అనువారు వరసకు అన్నదమ్ములు. అన్నదమ్ముల బిడ్డలు. నిమివంశము వారు. రాజ్యము కొరకు ఇరువురు యుద్దము చేయగా యుద్ధములో ఖాండిక్యుడు ఓడిపోయెను. పోయిన రాజ్యము ఎటూపోయింది. మోక్షమయినా సాదిద్దాము అనుకుని అడవికి తపస్సు చేయసాగాడు.

కేళీద్వజుడు రాజ్యము పాలిస్తూ యజ్ఞము చేయ సంకల్పించుకున్నాడు. యజ్ఞము కొరకు ఒక ఆవును సిద్ధముచేసుకున్నాడు. ఆ ఆవు యజ్ఞవాటిక చుట్టూ గడ్డిమేయుచున్న సమయంలో పులి ఒకటి దాన్ని పట్టి చంపివేసింది. ఇది తెలిసిన ఋత్విక్కులు(యజ్ఞము నిర్వహించే బ్రాహ్మణులు) విషయం రాజుతో చెప్పి, యజ్ఞము కొరకు ఏర్పడిన ఆవు ఇట్లయినది కాబట్టి, రాజు తప్పక ప్రాయశ్చిత్తము చేయవలెను, ఆప్రాయశ్చిత్తము మేమిటో ఖాండిక్యుడుకు మాత్రమే తెలుసు అన్నారు.

ఖాండిక్యుడు తనకు విరోధి. తాను యుద్ధములో ఓడించి అడవికి పంపాడు. అయినా తాను తప్పక ఖాండిక్యుడను కలసితీరవలసిందే. "పగదీర్చుకొనుటకు ఖాండిక్యుడు తనని చంపినట్లయితే తనకు యజ్ఞఫలము వస్తుంది. లేదా దయతో కాండిక్యుడు తనకు ప్రాయశ్చిత్వము చెప్పితే, తానే తిరిగి వచ్చి యజ్ఞమును పూర్తి చేస్తాను" అని అనుకొని కేళిద్వజుడు, ఖాండిక్యుని వద్దకు వెళ్ళాడు. కేళీద్వజుడు తనను చంపటానికి వసుతన్నాడని భావించి ఖాండిక్యుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.

కేళీద్వజుడు తాను యుద్ధానికి రాలేదని, ప్రాయశ్చిత ఖర్మ తెలుసుకోవటానికి వచ్చితినని, వచ్చిన పనిని చెప్పాడు. ఖాండిక్యుని పరివారమంతా కేళీద్వజుడిని చంపెయ్యమని సలహా యిచ్చారు. ఖాండిక్యుడు అందుకు అంగీకరించలేదు. కేళీద్వజునికి ప్రాయుశ్చితక్రమము చెప్పి పంపివేశాడు. కేళీద్వజుడు యజ్ఞం పూర్తి చేశాడు.

గురుదక్షిణగా ఖాండిక్యుడు కోరినది యివ్వటానికి తిరిగి అతని దగ్గరకు వెళ్ళాడు.

మొదటిసారి చంపమంటే చంపలేదు. తిరిగి మళ్ళీ యిప్పుడు వాడే వచ్చి ఏంకావాలన్నా యిస్తానంటున్నాడు. కాబట్టి నీ రాజ్యం నీకీయమని అడగమని ఖాండిక్యుని అతని పరివారమంతా వత్తిడి చేశారు. అయినా ఖాండిక్యుడు అందుకు ఇష్టపడలేదు. తాను యజ్ఞక్రియలయందు ఎంతపండితుడో, కేళీద్వజు వేదాంత విద్యయందు అంతపండితుడు. కాబట్టి తుచ్చమైన రాజ్యాన్ని కోరుటంకంటే ఆ యోగ విద్యను సంపాదించుట మంచిది అని భావించి, ఖాండిక్యుడు కేళీద్వజుడు వద్ద యోగ విద్యనేర్చుకున్నాడు. రాజ సభలో విష్ణు చిత్తుని నోట భగవానుడయిన శ్రీ మహావిష్ణువు చెప్పిన కథ యిది.

పేజి   12 |   34567 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved