17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కృష్ణదేవరాయుని ఆముక్తమాల్యద - కథాసారం

By కె, శర్మ

"ఆముక్త"-"మాల్య"-"ద"

"ఆముక్తమాల్య" శ్రీ కృష్ణదేవరాయులచే వ్రాయబడినది. ఆయుక్త మాల్యద అనగా, "ఆముక్త" అలంకరించుకోబడిన "మూల్య"పూలదండను, "ద" - ఇచ్చునది. అంటే, ఒక భక్తురాలు పూలదండ గుచ్చి మొదట తాను అలంకరించుకుని, తరువాత భగవంతుని మెడలో వేసేదిట. ఈ పుస్తకములోని కథానాయిక ఆమె. యిది ఆమె యొక్క కథ. ఆమె పేరు గోదాదేవి. ఆమె తండ్రిపేరు విష్ణు చిత్తుడు. గోదాదేవికి మరియొక పేరు ఆండాళ్. తమిళ భాషలో "ఆందాళ్" అంటే లక్షీదేవి అని అర్థము.

గోదాదేవి "విష్ణు" భక్తురాలు. ఆమె వట్టి "ఆముక్తమాల్యద" మాత్రమే కాదు. ప్రొద్దునే నిద్రలేచి కృష్ణపూజకు వెడుతూ, యశోదను, గోపికలను కూడా రమ్మని పిలుస్తూ తనదయిన రీతిలో పాటలు పాడేది. అది ఒక విలక్షణమయిన కవిత్వము. అటువంటి అమాయకమయిన "భక్తి" భగవంతునికి ఎంతో ప్రీతికరమయినది.

మధురా నగరం - మోక్ష మార్గముపై పండిత సభ

మధురానగరమునకు రాజు మత్స్యద్వజుడు ఆయన పాండ్యుడు. మధురానగరమునకు సమీపమున "వృషగిరి" ఉంది. అక్కడ గొప్ప వైష్ణవాలయము ఉంది. ప్రతియేటా వేసవిలో అక్కడ "తెప్పతిరునాళ్ళు" జరుగుతాయి. ఎంతో మంది పరదేశీయులు ఆ తెప్పతిరునాళ్ళు చూడటానికి వస్తూ వుంటారు. అలా ఆ సంవత్సరము ఎంతో మంది బ్రాహ్మణులలో ఒక బ్రాహ్మనుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణునికి తెప్ప తిరునాళ్ళ చూచిన పిమ్మట రాజధాని అయిన మదురానగరము చూడాలనే కోరిక కలిగింది. అలా ఆ బ్రాహ్మణుడు మధురానగరము వెళ్ళి ఓ పురోహితుని యింట బస చేశాడు. ఆ రాత్రి, బసచేసిన పురోహితుని యింట భోజనము చేసి, తాను వెంట తెచ్చుకున్న బట్ట ల మూటను తలక్రింద పెట్టుకుని పడుకుని తోటి బ్రాహ్మణులు చదువుతున్న పురాణము, గీత సుభాషితములు వంటివి వింటున్నాడు.

ఆసమయంలోనే మధురాపురపు రాజు అటుగా వెళ్తూన్నాడు. ఆయనకొక ఉంపుడుకత్తె ఉంది. ఆమె కొరకు ఆయన చక్కగా అలంకరించుకు మరీ వెళ్తున్నాడు. ముందు పరివారము నడుస్తోంది. వెనుక ఆయన ఉన్నాడు. రాజుగారు ఆ బ్రాహ్మణుడి యింటి ముంగటకు వచ్చే సమయానికి ఆ బ్రాహ్మణుడు ఒక పధ్యం చదువుతున్నాడు.

దాని అర్ధమేమనగా, వానాకాలములో భోజనానికి, వాన లేనప్పుడు సంపాదించుకోవాలి. రాత్రి భోజనానికి పగలు సమకూర్చుకోవాలి. ముసలి తనములో సంపాదించలేము కాబట్టి వయసులో సంపాదించి దాచుకోవాలి. అలాగే చనిపోయిన తరువాత పరలోకము ఒకటుంది. అది ఎలా ఉంటుందో తెలియదు కాబటి దానికోసం బ్రతికి వున్నపుడే "పుణ్యం" ప్రోగు చేసుకోవాలి అని.

రాజుగారు ఆ పధ్యం విన్నాడు. అతని మనసు మారిపోయింది. ఈ వయస్సు ఎప్పటికీ వుండేది కాదు. ఈ రాజ్యమూపోయేటప్పుడు తననట్టిపుట్టుకుని ఉండదు. అలాంటప్పుడు తనకెందుకు ఈ వాంఛలు? అని వివేకము కలిగింది. మరునాడు పండితులను పిలిపించాడు. మోక్షమనేది ఎలా వస్తుందో వివరించమని అడిగాడు. ఎవరు చెబుతారో వారికి బంగారు నాణెములు (సంచి) యిస్తానని చెప్పాడు. పండితులు అనేక వాదములు చేశారు. మోక్షకారకుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే అన్నారు. మరికొందరు పరమేశ్వరుడు మాత్రమే మోక్షమీయగలడు అన్నారు. వాదోపవాదములు సాగుతున్నాయి.

విల్లిపుత్తూరు - విష్ణుచిత్తుడు

ద్రావిడ దేశమున విల్లిపుత్తూరు అని గ్రామముంది. ఆ ఊళ్ళోనివారందరు వైష్ణవులు, భాగవతులు. ప్రతి ఇంటి ముందర ద్వార బంధానికి యిరువైపులు శంఖచక్రాలుంటాయి. ఆ వూరిలో విష్ణుచిత్తుడను బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు గొప్ప అన్నదాత. విష్నుభక్తుడు. ఒకసారి శ్రీమహావిష్ణువు, విష్ణుచిత్తునితో "నీవు మధురానగరానికి వెళ్ళి తనని గురించి గొప్పగా చెప్పి, వాదములో గెల్చి ఆ బంగారు నాణెములు తెచ్చుకో. ఆ రాజును వైష్ణవునిగా చెయ్యి" అని చెప్పాడు.

నీ పల్లికీ మోయుటము, నీకు సేవ చేయటము కంటే నాకు వేరు వాదములు ఏమి తెలుసు. నన్నిట్లు పురమాయించ వద్దు అని వేడుకున్నాడు విష్ణుచిత్తుడు. పోవయ్య, పిచ్చివాడా! నీ పాండిత్యమెవరికి కావాలీ! సభలో నిన్ను నేనే గెలిపిస్తాను అన్నాడు స్వామి.

స్వామి మాటలకు మారుపలుకలేక విష్ణు చిత్తాడు రాజసభకు వెళ్ళాడు.

వేదాల నుండి ఉపనిషత్తుల నుండి ఎన్నో ఉదాహరణలు అతనికి తెలియకుండానే విష్ణు చిత్తుని నోట నుండి వచ్చాయి. అలా విష్ణుచిత్తుని నోటి నుండి స్వామి చెప్పిన ఉపాఖ్యానాలలో కండిక - కేళిద్వజులు కథ ఒకటి.

పేజి   1 |   234567 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved