22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

బాలికల విద్య మెరుగు పరచటానికి కృషి అవసరం

భారత రాజ్యాంగ ఆదేశ సూత్రాల ప్రకారము బాల-బాలికలకు నిర్బందోచిత ప్రాథమిక విద్య ఉన్నప్పటికీ ఇప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకాక పోవటము నిజంగా దురదృష్టకరం.

నగరాల్లో బాలికల విషయం కొంతమెరుగుగా ఉన్నా, గ్రామస్థాయిలో బాలికల ’విద్య’ మరీ దయానీయంగా ఉంది. పాఠశాలలు అందుబాటులో లేకపోవటం అరా-కొరా ఉన్నా, తల్లిదండ్రులు ఆడపిల్ల విద్యను నిర్లక్షంగా చూడటం సర్వసాధారణ మయింది. ఆడపిల్ల అనగానే చదివి ఏమ్ సాధిస్తుందనే నిరాశాధోరణి , పనికి పంపితే నాలుగు రూపాయలు ఇంటికి అక్కరకొస్తాయని ఆశ తల్లి దండ్రుల్లో ఎక్కువగ కనబడుతోంది. చిన్న వయస్సులో పెళ్ళిళ్ళు, ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నాయనేది ఒప్పుకోవల్సిన నిజం.

పెళ్ళి చేయటంతో ఆడపిల్ల బాధ్యత పూర్తవుతుంది, దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేది వారి వాదన. ఆడపిల్లయినా సరే వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అనే గ్రహింపు గ్రామీణ తల్లులకు తక్కువనే చప్పాలి.

నగరాల్లో కూడా చాలా మంది ఆడపిల్లలస్థాయి ఆపాటిదేననేది గ్రహించాల్సిన విషయం. కాకపోతే పిల్లకు డిగ్రీస్థాయి వరకు ’విద్య’ నందిస్తారు. ఆ తరువాత వాళ్ళ దృష్టిలో తగిన సంబంధము అనుకున్నదాన్ని నిర్ణయించి పెళ్ళిచేస్తారు. చదువుకున్నా సరే ఉద్యోగం చెసుకున్నా సరె పెళ్ళయ్యాక నీ యిష్టం మీ ఆయనిష్టం అంటారు. అంతేగానీ ఆడపిల్లకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయని గుర్తించటం, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడటం తక్కువనే చెప్పుకోవాలి.

పిల్లయినా,పిల్లవాడయిన ఈ రోజుల్లో ఒకటే.ఎవరైతే ఏమిటి!? అని చాలామంది అంటున్నా, ఆడపిల్ల పుట్టగానే ఒక్క క్షణం "ఆడపిల్ల" అని నిస్పృహ చెందటం, మగ పిల్లవాడయితే ’అబ్బాయే’ అని ఆనందపడటం గ్రామీణ వాతావరణంలోనే కాదు, ఆధునిక నగరాలలో కూడా కనబడుతునే ఉంది.

అయితే కొంతమంది చదువుక్కున్న ఆడవారు (కొంతమంది చదువులేని స్త్రీ లలో సైతం) తమను తాము చూసుకునే విధానంలో మార్పు వస్తోంది. తాము మగవారితో , ఏ విషయంలోనూ తక్కువగాదని, దేన్నయిన సాధించగలమని, సొంత వ్యక్తిత్వంతో ముందుచూపుతో ఎదుగగలమనే ఆత్మస్థైర్య ధోరణి కనబరుస్తున్నా సమాజ పరిస్థితులు వారికి అడుగుగడుగున అడ్డుపడుతూ వెక్కిరిస్తున్నాయి. చేయుతనిచ్చి అండగా నిలబడవలసిన స్త్రీ-సంఘాలు వీరి కష్టాలను పట్టించుకోవటం కంటే తమ భర్తల రాజకీయాలకు ప్రాబల్యం చేకూరే సమస్యలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ప్రచారం చేయటం ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న పెద్ద అవకరము.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved