22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆశియా దేశాల చంద్ర యానం

By కె, ప్రమద

20వ శతాబ్దంలో అమెరికా, సోవియట్ రష్యాలు చంద్రుని చేరాయి. 21వ శతాబ్దంలో ఇప్పుడు ఆసియా దేశాలు ప్రయాణమయ్యాయి.

1960, 70 దశకాలలో అమెరికా, సోవియట్ రష్యా దేశాలు పోటీపడి చంద్రుని చేరాయి. ఇప్పుడు ఆ పోటీ ఆశియా దేశాల మధ్య మోదలైంది. 2007 సెప్టెంబరులో జపాన్ వారు "కుగయ" అనే అంతరిక్ష నౌకను ప్రయోగించారు. చైనా వారి "చాంగై-1" అక్టోబరులో చంద్రుని వైపు దూసుకుపోయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO), 2008 ఎప్రియల్ నాటికి "చాంద్రాయన్ - 1 " ను ప్రయోగించడానికి త్వరితగతిన సన్నాహాలు చేస్తున్నది. దక్షిణ కొరియా కూడా చంద్రుని అధ్యయనానికి ఒక నౌకను ప్రయోగించే ఉద్దేస్యంలో ఉంది.

చంద్రుని అధ్యయనం చేయడం ద్వారా అంతరిక్ష నౌకల నిర్మాణం, ప్రయోగం వంటి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించవచ్చునని, ఇది తురువాతి కాలంలో రోదసీలోని ఇతర గ్రహాలను అధ్యయనం చేయటానికి ఎంతో తోడ్పడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

భారత్-రష్యాలు 2011-12 నాటికల్లా చంద్రునిపై చరించగల వాహనాన్ని పంపడానికి ఒక అవగాహనకు వచ్చాయి. చైనా కూడా ఇటువంటి వాహనాన్ని పంపించాలని ప్రయత్నిస్తోంది. ఇది ఇలా వుండగా, అమెరికా 2020 నాటికి చంద్రునిపైకి మానవులను తిరిగి పంపటానికి ప్రణాళికలను సిద్దం చేస్తోంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved