17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు పత్రికల తీరు తెన్నులు

మన పత్రికా రంగంలో వచ్చిన మరొక సరికొత్త పరిణామం మితిమీరిన వ్యాపార దృష్టి - ముద్రణ పద్ధతులలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి వలన నేటి పత్రికలు చూడ ముచ్చటగా వుంటున్నాయి. మరి, చదువ ముచ్చటగా వుంటున్నాయా? ఎప్పుడో ఒకటీ అరా తప్ప నేటి పత్రికలలో ఇది మరీ అరుదైన మాట అయింది. ఒకనాడు పెద్ద పత్రికలు కొన్ని స్వల్ప విషయాలను స్థానిక చిన్న పత్రికలకు వదలి వేసేవి. ఈనాడు అలాకాదు. ప్రతీ చిన్న పెద్ద విషయాలలో తలదూర్చి చిన్న పత్రికల మనుగడను దుర్లభం చేస్తున్నాయి. ఒకనాడు సమాజ శ్రేయస్సే పత్రికల ప్రధాన ధేయ్యంగా ఉండేది. ఈనాడు అలాకాదు. యజమానుల వ్యాపార పారిశ్రామిక ప్రయోజనాలను పెంపొందించుకొనటానికి ఉపకరణాలుగా పత్రికలు ఉపయోగపడుతున్నాయి. అలాగే రాజకీయాధికారపు ప్రాపును పొందటానికి, వీలైతే రాజకీయ అధికార పదవులను చేజిక్కించుకొనటాననకీ యజమానులు పత్రికకలను సోపాననలలగా ఉపయోగించుకొంటున్న సందర్భాలూ ఉన్నాయయ.

ఇవన్నీ చూచినపుడు అటు ప్రభుత్వ ప్రసార సంస్థలకూ, ఇటు పత్రికలకూ తేడా అట్టే కనిపించదు. ఇవన్నీ అందరూ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు.

- వ్యాస రచయిత పాత్రికేయ రంగంలో ఈనాటి వృద్ధమూర్తులలో ఒకరు అయిన నిరంతర యువకుడు. జమీన్ రైతు సంస్థ నెలకొల్పిన ఉత్తమ జర్నలిస్టు అవార్డు సత్కారం పొందారు. మద్రాసులోని అమెరికన్ కాన్సులేట్లో ఉన్నత పదవులు నిర్వహించి ప్రస్తుతం రిటైరై సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

పేజి   123 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved