17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు పత్రికల తీరు తెన్నులు

ఆ తరువాత ఈ శతాబ్ధి మొదటి పాదంలో వచ్చిన 'కృష్ణాపత్రిక' (1901), '' స్వరాజ్య'' (1905), ఆంధ్ర ( వార) పత్రిక (1907), '' ఆంధ్ర (దిన) పత్రిక'' (1914), '' కాంగ్రెస్'' 91921), '' జమీన్ రైతు'' 91930), '' వాహిని'' 91935), '' ఆంధ్రప్రభ'' 91938) ఇలా వరుసగా తెలుగులో పత్రికలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిలో '' జమీన్ రైతు'', '' ఆంధ్రప్రభ'' మాత్రమే ఇప్పటికీ సజీవంగా కొనసాగుతున్నాయి. ఇలా జరుగుతూ వచ్చిన తెలుగు పత్రికా రంగం చరిత్రలో 1941 నుంచి ఒక కొత్త మలుపు వచ్చింది. అప్పటి వరకూ ఈ పత్రికలన్నీ గ్రాంధిక భాషలో ఉండేవి.

కాగా, నార్ల వెంకటేశ్వరరావుగారు ఆ యేడు ఆంధ్రప్రభ సంపాదకత్వాన్ని చేపట్టడంతో ఈ పెద్ద మార్పు వచ్చింది. పత్రికా రచనలో జన భాషను ఒక పద్ధతిలో ప్రవేశపెట్టి, వాడుక భాషలోనే వార్తలను అందించే ఆధునిక సంప్రదాయాన్ని నెలకొల్పిన ఘనత నార్ల వారిక దక్కుతుంది. గిడుగు వారి వ్యావహారిక భాషా ఉద్యమం, తాపీవారి వాడుక భాష వినియోగ ప్రయోగాలు నార్ల వారికి ఈ విషయంలో తోడ్పడ్డాయి. ఇలా వుండగా 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దానితోపాటే పరాగతం కారాని జన్మహక్కులు, పౌరహక్కులు మనకు సంక్రమించాయి. పర్యవసానంగా మన బాధ్యతలు పెరిగాయి. పత్రికల ప్రాముఖ్యమూ పెరిగింది.

స్వాతంత్ర్యానంతరం మన వార్తా పత్రికల సంఖ్యలోనూ, వాటి ప్రాచుర్యంలోనూ విశేషమైన పెరుగుదల వచ్చింది. అలనాటి చిలక ముద్రణ దశ నుంచి ఈనాడు కంప్యూటర్తోనే చేసే అక్షరాల కూర్పు పద్ధతి వరకు ముద్రణ పద్ధతులలో ఎంతో పురోగమనం జరిగింది. అలాగే ఒకానొకటి ' ఏడురోజులనాటి' తాజావార్త అని పత్రికలు చెప్పుకొనే స్థితి నుంచి ఏడు నిమిషాలలో, ఈరేడు లోకాలలో ఎక్కడ ఏమి జరిగిందీ, జరుగుతున్నదీ తెలుసుకొని ప్రచురించగల మహోన్నత సాంకేతిక దశకు పత్రికలు చేరుకున్నాయి.

అయితే మన పత్రికా రచనా ప్రమాణాల విషయంలో ఆశించవలసినది ఎంతైనా ఉంది. జడ్జీల వలెనే జర్నలిస్టులు కూడా రాగద్వేషాలకతీతంగా వాస్తవాలను నిష్పాక్షిత దృష్టితో విషయ వివేచన చేసి చెప్పడం సబబు, సుముచితము, వాంఛనీయమూ. మరి, మన పాత్రికేయులందరూ ఈనాడు అలా చేస్తున్నారని చెప్పగలమా? అటువంటి జర్నలిస్టులు అసలే లేరని కాదు, అటువంటి పత్రికలూ లేవని కాదు. ఆ సంఖ్య అతి స్వల్పం. మన రేడియో, టెలివిజన్ సౌకర్యాలు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో వున్నందున వాటి నుంచి నిష్పాక్షికతను ఆశించజాలము. మన పత్రికలు సైతం వాటి యజమానుల అన్య పారిశ్రామిక పరిరక్షణకు మాత్మే ఉపకరిస్తున్నాయన్న భావం ప్రబలంగా ఉన్నది.

నిజానికి ఈనాడు మన జర్నలిజం ఒకవైపున పాలకుల ఒత్తిళ్ళకూ, మరొకవైపున వ్యాపార ప్రకటనలిచ్చి పోసించే పారిశ్రామికుల ఒత్తిళ్లకూ మధ్యన నలిగిపోతున్నది. ఇటీవలి కాలంలో మన పత్రికా రంగంలో మరొక అవాంఛనీయమైన పరిణామం వచ్చింది. పత్రికా నిర్వహణలో ఒకనాడు సంపాదకునికి ఎనలేని ప్రాముఖ్యం ఉండేది. ఈనాడు అతడు దానిని కోలోపయాడు. ఈ తిరుగులేని పెత్తనం పత్రికల బిజినెస్ మేనేజర్ల చేతుల్లోకి పోయింది. పలితంగా ఈనాటి పత్రికా సంపాదకుడు ముగ్గురు పెత్తందార్లను సంతృప్తి పరచవలసిన దయనీయమైన పరిస్థితులలో పడిపోయాడు. సంపాదకుని పూర్వ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతిన్నది. అందువల్లనే ఒకనాడు ఎడిటర్లకు జర్నలిస్టులకు ఉన్న గౌరవం ఈనాడు లేదు.

పేజి   12 |   3 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved