22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆంధ్ర మహిళాసభ నీడలో..వయోజన విజ్ఞానం

By కె, మణినాథ్

1957లో దుర్గాబాయి మదిలో పడిన బీజం, 1972లో హైదరాబాద్ ’లిటరసీ హౌస్’గా రూపుదిద్దుకుంది

' ఆంధ్ర మహిళా సభ' వ్యవస్థాపకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ ముఖ్ చిన్నతనంత నుంచీ దేశభక్తిని రంగరించుకుని పెరిగారు. 1909 జూలై 15న రాజమండ్రిలో జన్మించిన వీరిపై గాంధీజీ ప్రభావం వుండేది. బాల దర్గ చూపిన ధైర్య సాహసాలకి నిరద్శనం... 1923లో నేషనల్ కాంగ్రెస్ మహసభలు, ప్రదర్శనలు జరుగుతున్నపుడు వాలంటీరుగా ప్రవేశద్వారం వద్దనున్న బాలదుర్గ పండిట్ జవహర్లాల్ నెహ్రూనే టికెట్ కోసం నిలిపేసిన ధీరురాలు... అలాగే 1927లో గాంధీజీ నిధుల సేకరణకై ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమండ, కాకినాడ పట్టణాలకి విచ్చేసినప్పుడు ఐదువేల రూపాయల నగదు, మహిళల నగలు విరాళంగా అందించడంతోపాటు తన చేతి గాజులను దానమిచ్చిన ఘనత ఆమెదే. తన తల్లి కృష్ణవేణమ్మనే మొదటి విద్యార్ధిగా చేసుకుని స్ర్తీలకి విద్యాబోధ చేసిన బాలదుర్గ ఇలా ఎన్నో ఘటనలు బాల్యంలోనే చోటు చేసుకున్నాయి.

భారతీయులపై తెల్లవారి దౌర్జాన్యాలు, అకృత్యాలు ఆమెను స్వాతంత్ర్య సమరంలో సివంగిలా విజృంభించేలా చేశాయి. ఆమె ఉపన్యాసాలు అదరినీ ఉద్రేక పరిచేవి. 1930, 1932 సంవత్సరాలలో జైలుకి వెళ్లి కఠిన కారాగా శిక్షని అనుభవించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వయోజన విద్యావ్యాప్తిపై ఆసక్తి పెరిగింది.

బాల్యం కాకినాడలోను, లాయరుగా మద్రాసులోనూ వృత్తిరీత్యా రాజ్యసభ మొంబరుగా ఢిల్లీలోనూ జీవితాన్ని గడిపిన దుర్గాబాయి ఆంధ్రులకి ఎంతో సేవచేశారు.స్త్రీల అభ్యుదయానికి ఎంతో కృషి చేసిన వీరు ' హిందూకోడ్' బిల్లు ప్రవేశపెట్టారు. హిందూకోడ్ బిల్లు ద్వారా స్త్రీలకి విడాకులు.....విఆవహము... ఆస్తి హక్కు, దత్తత స్వీకారపు హక్కు మొదలైనవి లభించాయి. వీటిద్వారా ఎందరో స్త్రీలు తమ హక్కులని వినియోగించుకున్నారు.

సమాజంలో స్త్రీలు పడే ఆవేదన, కష్టాలు, దారిద్ర్యం మొదలైన సమస్యలకి కారణం స్త్రీల నిరక్షరాస్యత అని భావించిన దుర్గాబాయి 1937లో చెన్నై నగరంలో 'లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్' స్థాపించారు. అదే 1948లో ఆంధ్ర మహిళాసభగా ఆవిర్భవించింది. స్త్రీల విద్యావ్యాప్తి, అభ్యుదయం, కళావికాసం... మొదలైనవి ఆశయాలుగా వున్న ఆంధ్ర మహిళాసభ కాలేజీ, స్కూలు, హాస్టలు,నరసింగ్ హోం, హాస్పిటల్ మొదలైన శాఖలుగా విస్తరించింది. గ్రామాలలో సైతం మహిళా ప్రసూతి ఆస్పత్రులు, బాలవాడీలు నేడు చెన్నై, ఆంధ్ర రాష్ట్రాలలో 23 శాఖలతో విస్తరించడానికి చాలామంది చేయూతనందించారు. తిమ్మాయమ్మ, సుగుణమణిల నిస్వార్థసేవ, సహకారాలతోపాటు ఎందరో కృషిచేశారు.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved