17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మాట-విలువ

By కె, మణినాథ్

ప్రాంతమేదైనా, దేశమేదైనా మదిలో మెదిలే భావ ప్రకటనల రూపమే "మాట". మాటలద్వారా అనంతకోటి భావాలను పలికించవచ్చు

ప్రతి వ్యక్తి జీవితంలో మాట అనేది ఎంతో విలు వైనది. ప్రతి చర్యా, ప్రతి కదలికా ప్రతి పనీ మాటతోనే ముడిపడి వుంది. ప్రాంతమేదైనా, దేశమేదైనా భాషేదైనా మదిలో మెదిలే భావ ప్రకటనల రూపమే "మాట" . మాటల ద్వారా అనంత కోటి భావాలను పలికించవచ్చు. మాట లేనిదే భావం లేదు. భావన లేనిదే మనిషికి మనిషికి మధ్య జీవనశైలి, ఆత్మీయతాను రాగాలు, మనషి మనుగడ ......లేదు. ప్రేమతో పలకరించే పిలుపులు,మాటలు ఎంతో ఆత్మీయతని, ప్రేమని పంచుతుంది. ఆ వ్యక్తి అందరి అభిమానాన్ని చూరగొంటాడు.

సమయానికి తగు మాటలాడెనే అన్నట్లు సంధర్భానుసారం మాట్లాడాలి. మాట్లాడే మాటల విలువ , కాలం విలువని గ్రహించాలి. Silence is Gold; Speech is Silver అనే నానుడి సత్యం. లోకంలో బంగారానికి ఇచ్చే విలువ ఎక్కువ. నిశ్శబ్దం ద్వారా ఎన్నో ప్రశ్నలకు సమాధానం పొందచ్చు. తక్కువ మాట్లాడే వారి మాటలకు ఎంతో విలువ ఉంటుంది. ఎక్కువ మాట్లాడే వారు, ప్రగల్భాలు పలికేవారు చేతలలో శూన్యులు. లక్ష్యసాధన చేయలేరు. అలాగే పెద్దల మాట చద్ది మూట. అనుభవంతో మాట్లాడే వారి మాటలలో అనుభవాన్ని గ్రహించి , వాటిని తాము ఎదుర్కునే సమస్యలకు, సంఘటనలకు అన్వయించుకొని తెలివిగా బయటపడవచ్చు. మంచి చెడులను గ్రహించి మంచిని ఆచరించే ప్రయత్నం చేయాలి.

నిత్య జీవితంలో మనిషి ఎదుర్కునే మాటలు ఎంతో ప్రభావాన్ని చూపుతుంటే..... మన ఇతిహాసాలు, వేదాలు, బైబిలు, ఖురాను వంటి పవిత్ర గ్రంధాలు, వాటిలో ప్రవచించిన ప్రతి మాటా ఎంతో విలువైంది. శక్తి వంత మైంది. మానవ జీవితం పై వీటి ప్రభావం కూడ ఎంతో వుంది.

మాటలు లేకుండా ఏ ఆలోచనలు ఉండవు.. ప్రపంచంలోని వస్తువులన్నీ ఆలోచన రూపంలోనూ, ఆలోచనలు పదాల కలయికలతోనూ ఏర్పడ్డాయి. ఉదాహరణకి 'కృష్ణుడు' అనే పదం మన నోటి వెంట వచ్చినపుడు మన మనసులో కృష్ణుని రూపం మెదలటం..అతను చేసేకృష్ణలీలలు, కృష్ణుని కధ ఇలా ఎన్నోమదిలో కదలాడతాయి. మనం చూసే, వస్తువు, ఆలోచన, పదముల కలయికతో కృష్ణుడు అనేపదానికి పూర్తి అర్ధం చేకూరుతుంది.

మతాలు కూడా కొన్ని పదాల కలయికతో ఏర్పడ్డవే! పెద్దలు, గురువుల చెప్పిన కొన్నిపదాల తో కూర్చబడిన అనుభవాలు, నమ్మకాలు వంటివి గ్రంధాలద్వారా తెలుసుకుని, వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తుంటాము. ప్రతిభా వంతులైన గురువులు ఉపన్యశిస్తున్నపుడు వారు చెప్పే ప్రతి మాట తూటాల్లా, సూటిగా వుండే బాణాల్లా ఉంటాయి. వారి మాటల్లోఎంతో పవరు కూడా ఉంటుంది. ఎందరినో తమ వాక్ చాతుర్యంతో ఆకట్టుకోగలుగుతున్నారం టే..... ఆ గురువులకి తమ మీద.... తమ మాట మీద ..... తాము నమ్మి న సిద్ధాంతాల పైన వారికి గల ప్రగాఢమైన నమ్మకం.... ఆత్మ విశ్వాసం పెట్టని కోట గోడల్లా ఉంటాయి. అటు వంటి వారు ఉపన్యసించినా మాట్లాడినా ప్రపంచమే మోకరిల్లుతుంది. స్వామి వివేకానంద.... స్వామి చిన్మయా నంద వంటి వారి ఉపన్యాసాలు ఎందిరినో ఆకట్టుకోగలిగాయంటే అది వారి వాక్ చాతుర్యం....... మాటల శక్తి . ... మన దేశ సంస్కృతి....అని చెప్పక తప్పదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved