17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అనుబంధాలు పెంచే "ఆత్మీయ కలయిక"

చక్కని అనుభూతులు మిగిల్చే సంఘటన ఒకటి గుర్తొచ్చింది. ఎంతసేపూ సభలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక సభలూ ఇలా కృత్రిమంగా ఉన్న జీవనంలో ఆ సంఘటన మంచి అనుభూతిని మిగిల్చింది. విదేశాల్లో నివసించే అన్నదమ్ములు గ్రామాల్లో ఉన్న వృద్ద బంధువులు, పెద్దలు అయిన తమ ఇంటి పేరుగల వారిని ఒక చోట చేర్చి సత్కరించటం, తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ తమ అభివృద్ధికి పాటుపడ్డ ఆ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరునా పిలిచి గుర్తుచేసుకుంటూ యువతరంతోపాటు తమ వంశ వృక్షంలోని చిగురుటాకులైన చిన్నరులతో సహా అందరినీ పరిచయం చేయటం ఎంతో ముదావహం.

ఒంటరి జీవితాలతో కాలం గడిపేవారికీ, బిజీగా తమ పనులతో కాలం గడిపేవారికీ, టీవీలు, కంప్యూటర్లతో కాలం గడిపేవారికీ వేసవిలో వాన జల్లులలా ఇలాంటి ' ఆత్మీయ కలయిక।లు మానసికానందాన్నిస్తాయి. అనటంలో సందేహం లేదు. తమకు అనుకూలమైన రీతిలో తమ బంధువుల, ఆత్మీయుల ఆత్మీయానుబంధాలు, తీపి గురుతులు తిరిగి గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడపాలి. తరిగిపోయిన బంధాలు, అనుబంధాలు తిరిగి పటిష్టం చేసుకుంటే మన సమాజంలో ఐకమత్యంతో మెలగాలి. అంతా ఒక్కటే అనే భావం తప్పకుండా కలుగుతుంది.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved