17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అనుబంధాలు పెంచే "ఆత్మీయ కలయిక"

By కె, మణినాథ్

నిత్య జీవితంలో కొంత సమయం కేటాయించి పిల్లలకి తమ ఆత్మీయులని పరిచయం చేస్తూ తనూ మానసికానందం పొందటం వ్యక్తిగా యజమాని చేయాల్సిన భాద్యత.

యాంత్రికంగా మారుతున్న నేటి జన జీవనంలో ఆనాటి ఆత్మీయతానురాగాలు కొరవడుతున్నాయనే చెప్పాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఐకమత్యం, కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే మనస్తత్వం, ఎదుటివారికి సాయపడే తత్వం ఇత్యాదివన్నీ మనిషికి అలవడేవి. రాను రాను ధనం నిత్య జీవితంలో చూపించే ప్రభావం, ఆర్ధిక పరిస్థితులు, స్వార్ధం, స్వసుఖం, ఉద్యోగ రీత్యా వలసపోవడం వంటివన్నీ ఉమ్మడి వ్యవస్థని చీల్చి నూక్లియర్ కుటుంబాలకి దారితీశాయి. ఈ ఒంటరి కుటుంబ జీవనం సుఖాన్నిస్తోంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది. తమ పిల్లలకి కావాల్సిన ప్రొఫెషనల్ చదువులు చదివిస్తున్నారు. భార్యా, భర్త ఉద్యోగం చేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన లగ్జరీ వస్తువులు కొనుక్కోగలుగుతున్నారు. బ్యాంకు డిపాజిట్లు పెంచుకుంటున్నారు. ఆస్తులూ కూడబెడుతున్నారు. విదేశీయానాలు చేస్తున్నారు. ఆనందంగా జీవిస్తున్నామనుకుంటున్నారు. కానీ వయసు పైబడుతున్నకొద్దీ ఒంటరితనం బాధిస్తోందని గుర్తిస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్లై దూరమైతే, అనారోగ్యం పాలయితే చసూ తోడు, ప్రేమానురాగాలు పంచేవారు, బాగున్నారా అని పలకరించేవారు లేక ఏకాకులై సహ ప్రాణికోసం ఎదురుచూసే వారు ఎక్కువయ్యారు. పిల్లలని తాత, నాయనమ్మ, అమ్మమ్మలకు దూరంగా పెంచడంవల్ల బంధువులతో దూరంగా మెలగడం వల్ల కూడా పిల్లలకి ఎవరెవరో ఏమిటో తెలీకుండా స్కూలు, చదువు, ఉంటే స్నేహితులు, టీవీ, కంప్యూటర్లతో కాలం గడుపుతున్నారు. సుఖం, దుఃఖం, సతోషం, కష్టాలు ఇత్యాదివన్నీ ఇతరులతో పంచుకునే అవకాశం లేక యాంత్రిక జీవనం గుడపుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో కొంత సమయం కేటాయించి పిల్లలకి తమ ఆత్మీయులని పరిచయం చేస్తూ తానూ మానసికానందం పొందటం వ్యక్తిగా కుటుంబ యజమాని చేయాల్సిన బాధ్యత. కుటుంబంలోని అందరూ సరదాగా కాలం గడపటం, కలిసి భోజనం చేయటం, ఆత్యీయులని, బంధువులని కలవటం, తమ అనుభవాలు, జ్ఞాపకాలు తమ పిల్లలకి తెలయచేస్తూ ఆనందంగా గడపగలిగితే ఆ కుటుంబలో ఆరోగ్య వాతావరణం నెలకొంటుంది. అలా కాకుండా లేచింది మోదలు అప్పుల గొడవలు, కట్టాల్సిన బిల్లులు, ఆ రోజు చెయ్యాల్సిన పనులు, భార్యాభర్తల కీచులాటలు ఇవన్నీ ఆ కుటుంబలో ప్రశాంతత లోపిస్తుంది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved