22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

పౌర విమాన యాన రంగం (ఎయిర్ ట్రాన్స్ పోర్ట్)

దేశంలో విమానాశ్రయాలు, విమానయాన సర్వీసు కంపినీలపై సంక్షిప్త సమాచారం

దేశంలో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఢిల్లీ ( ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - పాలం), కోల్కతా (డమ్ డమ్), ముంబాయి (శాంతక్రజ్), చెన్నై (మీనంబాకం), కేరళ (తిరువనంతపురం)లో ఉన్నాయి. ఇంకా 87 ఏరోడ్రోమ్స్, 20 ప్రదేశాలలో విమానాలు దిగేందుకు అనువైన రన్వేలు ఉన్నాయి. వీటిని పౌర విమానయాన శాఖ పర్యవేక్షిస్తుంది. అలహాబాద్ కు సమీపంలోని ఫర్సత్ గంజ్లోని పౌరవిమానయాన కేంద్రంలో పైలెట్లకు శిక్షన ఇస్తారు. భారతదేశం 90 దేశాలతో పౌర విమాన సర్వీసులను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పదం కుదుర్చుకుంది.

ఎయిర్ ఇండియా

1953లో ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా 90 దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు వీలుగా ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఇండియన్ ఎయిర్ లైన్స్

ఇండియన్ ఎయిర్ లైన్స్ను 1953లో ఏర్పాటు చేశారు. 72 దేశీయ విమాన సర్వీసులను, 14 దేశాల్లో 16 అంతర్జాతీయ సర్వీసులను నిర్వహిస్తోంది. 1999లో 52 విమానాలతో సగటున ప్రతిరోజు 200 సర్వీసులను ఇండియన్ ఎయిర్ లైన్స్ నిర్వహించింది.

పవన్ హాన్స్ లిమిటెడ్

చమురు క్షేత్రాలు, పర్వత ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా పవన్ హాన్స్ లిమిటెడ్ హెలికాప్టర్ సర్వీసులను నిర్వహిస్తుంది. ఓఎన్ జిసి, లక్ష్యదీప్ ప్రాంతం గెయిల్ ( గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ ఎఫ్), ఇతర ప్రైవేట్ రంగాలకు ఈ సంస్థ హెలికాప్టర్ సేవలను అందిస్తోంది.

ప్రైవేట్ ఎయిర్ టాక్సీ

1990 ఏప్రిల్ నెలలో పౌర విమానయాన రంగంలో సరళీకృత విధానాలను ప్రవేశపెట్టారు. అనంతరం ఎయిర్ కార్పొరేషన్ చట్టం, ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా, వాయుదూత్ తదితర సర్వీసుల గుత్తాధిపత్యానికి స్వస్తి పలికినట్లయింది. ప్రైవేట్ ఎయిర్ టాక్సీలకు ఎయిర్ వేస్ 12 బోయింగ్ 737, సహారా ఎయిర్ లైన్స్ 3బి -737, స్కైటైన్ ఎనిపిసి 5, ఎనిపిసి ఎయిర్ లైన్స్ 9 విమానాలను నడుపుతున్నది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved