22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి

By బి, సర్వేస్వర రావు

1990లనాటికి ఆంధ్రదేశం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో వచ్చిన మార్పులు, రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రక్కరాష్ట్రాలతో పోల్చినప్పుడు మన రాష్ట్ర స్థితిగతులపై వ్యాసం

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 1953లో ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. 1956లో నిజాం సంస్థానంలోని తెలుగు ప్రాంతాలను కలుపుకొని విశాలాంధ్రగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మన రాష్ట్రానికి ఆంధ్ర కేసరి టుంగుటూరి ప్రకాశం పంతులుగారు ప్రథమ ముఖ్యమంత్రి. తరువాత నీలం సంజీవరెడ్డి, మాజి భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు లాంటి ప్రముఖుల సారధ్యంలో మనం గణనీయమైన అభివృద్ధి సాధించాం.

ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం జనాభాల్లో దేశంలో అయిదవ పెద్ద రాష్ట్రం. 1991 సంవత్సర జనాభా లెక్కల ప్రకారము రాష్ట్ర జనాభా సుమారు 66 మిలయన్లు ( దేశ జనాభాలో 7.8 శాతం). విస్తీర్ణం 2.77 లక్షల చదరపు కిలోమీటర్లు, (దేశ విస్తీర్ణములో 8.4 శాతం) మన రాష్ట్రం అనేక వనరులకు నిలయం. 974 కి.మీ. నిడివి కలిగిన సుదీర్ఘమైన తీరప్రాంతం, విలువైన ఖనిజ సంపద, నదులు అడవులకు నిలయం. నీటి వసతి కల సారమైన భూములు వున్నాయి. మన రాష్ట్రం ఒక చిన్న భారత దేశం అనవచ్చు.

గత నాలుగు దశాబ్ధాలలో మన రాష్ట్రం సాధించిన ప్రగతి స్థూలంగా పరిశీలిస్తే ఈ క్రింది విషయాలు స్పష్టపడుతాయి. 1956-57 సంవత్సరానికి మన ప్రణాళికా పెట్టుబడులురూ.26 కట్లు. 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొత్తం రూ.52కోట్లు. రాష్ట్ర ప్రణాళిక క్రింద ఖర్చు చేయడానికి ప్లానింగ్ కమీషను ఆమోదించింది. రాష్ట్ర తలసరి ఆదాయం 1960-61లో ప్రస్తుత ధరలలో రూ.275. ఇది 1986-87కి రూ. 2,184కు పెరిగింది.

మన రాష్ట్రం ఇప్పటికీ వ్యవసాయ రంగం పైనే ఎక్కువగా ఆధారపడి వుంది. 75 శాతం జనాభా వ్యవసాయ రంగం దానికి సంబంధించిన వృత్తులపై ఆధారపడినవారు. ప్రణాళికలు ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రణాళికా పెట్టుబడులలో 27శాతం నిధులను సాగునీటి పధకాలపై ఖర్చుచేశాము. నీటి వసతులు గల భూముల విస్తీర్ణము 1955-56లో 27.47 లక్షల హెక్టార్లు. ఇది 1986-87 నాటికి సుమారు 50 లక్షల హెక్టార్లకు పెరిగింది. ప్రపంచంలో కెల్ల పెద్ద ఆనకట్టల్లో ఒకటయిన నాగార్జున సాగర్ వలన 8.3 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతి కల్పించబడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మన దేశంలో నాలుగవ స్థానం మన రాష్ట్రానిది.చెరకు, వేరుశెనగ, ప్రత్తి, పొగాకు మన రాష్ట్రంలోని ముఖ్యమైన వాణిజ్య పంటలు. వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధితో పాటు కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయినవి. ఇది ప్రాంతీయ అసమానతలు, మెట్టభూముల సాగుకు సంబంధించినవి. వీటిని తరువాత విపులంగా చర్చిద్దాం

పేజి   1 |   23456 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved