19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు చరిత్రకు ఆధారభూతములు

చరిత్ర పరిశోధనకు ఆనాటి స్థితిగతులను అర్ధం చేసుకోవడానికి ఆనాటి నాణేలు, కట్టడాలు, శాసనాలు ఉపయోగపడతాయి

చరిత్ర పరిశోధనకు ఆధారభూతములు చారిత్రక విజయం (రచనలు). పురావస్తు పరిశోధన రచనలను దేశీయ, విదేశీయంగా విభజించవచ్చు. అలాగే పురావస్తు పరిశోధనకు శాసనాలు, నాణేలు, నిర్మాణాలు సహకరిస్తాయి.

దేశీయ విజ్ఞయాన్ని మత, మతేతరాలుగా విభజించవచ్చు.

ఆధారభూతములైన గ్రంథాలు:

 • వైదిక శృతి స్మృతి వాజ్ఞ్మయం (ఐతరేయ బ్రాహ్మణం)
 • జాతక కథలు (భీమసేన జాతకం, సెరివణిజ జాతకం)
 • జైన బౌద్ధ గ్రంథాలు
 • సుహృల్లేఖ రత్నావళీ రాజపరికథ (బౌద్ధాచార్యుడు నాగార్జునిని రచన: లౌకిక / రాజకీయ ఆలోచనా విధానం.
 • (ఈ పైవి శాతవాహనయుగ పరిస్ధితులకు ఆధారాలు).
 • శతకాలు (నీతి, భక్తి, శృంగారాలు వస్తువులుగా, రాజకీయ, ఆర్ధిక, సాంఘీక పరిస్ధితులను ప్రతిఫలించాయి)
 • (కాకతీయ యుగ విశేషాలను తెలుసుకోవడానికి ఉపయుక్తం).
 • సూతులు
 • అమీర్ఖుస్తూ (తారీఖ్-ఇ-అలై), ఇసామీ (ఫతూప్-ఉన్-సలాతీ), జియావుద్దీన్ బరనీ (తారిఖ్-ఇఫిరోజషాహి), పెరిష్టా (భారతదేశంలో ఇస్లాం విజృంభణ)
 • కైఫియత్తులు (దండకవిలెలు) - దేశం ముస్లిముల వశమైన తరువాత గ్రామాలలోని మిరాశీలను గురించి గ్రామాధికారుల నుండి ముస్లిం ప్రభువులు తీసుకొన్న విజ్మాలాలు

విదేశీ రచనలు

మెగస్తనీస్, ఏరియస్, టాలెమో, అజ్ఞాత గ్రీకు నావికుని '' ఎర్రసముద్రంపై దినచర్య -The preiphus of the exithrian sea (క్రీ.శ 60 ప్రాంతం)'' శక, శాతవాహనుల కాల నిర్ణయానికి ఉపయోగపడుతున్నవి. పెరిప్లెస్ దక్షిణ దేశంలోని రేవులను తెల్పుతున్నది.

విదేశీ యాత్రికులు, చరిత్రకారులు

ఫాహియాన్ (క్రి.శ. 400), యువాన్ బాంగ్ (క్రి.శ.640) ఇత్సింగ్ (క్రి.శ.670) - చైనీయులు. వీరి రచనల నుండి బౌద్ధమత స్థితిగతులు తెలుస్తున్నాయి. మొహమ్మద్-బిన్- తుగ్లక్ కాలం నుంచి ఇబిన్ బతుతా రచనల నుండి రాజకీయ, ఆర్ధిక, సాయాజిక, సాంస్కృతిక పరిస్థితులు తెలుస్తున్నాయి. పారశీక చక్రవర్తి (Persion & Iran) షారుక్ రాయబారిగా విజయనగరం వచ్చిన అబ్దుల్రజాక్ (క్రి.శ. 1442-48) రాయల కాలం నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నది. మార్కోపోలో (వెనీసు) ( క్రి.శ 1292) కాకతీయుల విజయనగర చరిత్ర పరిశీలనకు ఉపయుక్తమయిన ఇతర విదేశీ రచయితలు.

 • నికోలో కాంటీ (క్రీ.శ 1442)
 • పేస్ (క్రి.శ1520-22)
 • న్యూనిజ్(క్రి.శ 1535 -37)
 • బర్రాడస్(క్రి.శ 1616)

క్రైస్తవ మత ఆగమనానంతరం చర్చి పాదరీల ''దిన చర్య''లు కూడా చరిత్ర పరిశీలకులకు ఉపయోగపడుతున్నాయి

శాసనాలు

 • అశోకుని శాసనాలు (క్రి.పూ.250): ఎర్రగుడి, రాజుల మందగిరి(కర్నూలు),ధాన్యకటకం;
 • భట్టిప్రోలు స్తూపంలోని కరండ శాసనాలు (క్రి.పూ.200)
 • నాగనికా నానాఘట్ శాసనం
 • బాలశ్రీ నాసిక్ శాసనం
 • ఖారవేలుని హతిసంఘ శాసనం
 • రుద్రధాముని జునాగడ్ శాసనం
 • మైదవోలు తామ్ర శాసనం (క్రి.శ300) మహారాజ శిస్కందవర్వద్వారా

నాణెలు

 • అమరావతిలో వెండి విదాంక (Punch marked) నాణేలు, శాతవాహనుని నాణేలు, శాతకర్ణి అశ్వమేధ నాణెం, పులోమావి యజ్ఞశ్రీల నౌకాచిహ్నం ఉన్న నాణేలు, జోగెల్తంచి నిధిలోని గౌతమీపుత్రుడు ముద్రించిన నహపాణుని నాణేలు, వెండి ద్విభాషా నాణేలు.
 • ఇక్ష్వాకుల నేసపు నాణేలు (శాతవాహనులను అనుసరించి ఉండేవి)
 • శాతవాహన, ఇక్ష్వాకుల కాలంనాటి రోమన్ బంగారు నాణేలు
 • విష్ణుకుండిన కాలపు రాగిమలామా, చేసిన ఇనుపనాణేలు
 • తూర్పుచాళుక్యులవి దొరకలేదు (వాజ్ఞ్మయ ఆధారాలు కలవు)
 • చాళుక్య చోళయుగంలో గద్వాణు, మాడ, రూక, చిన్నం (దొరకలేదు)
 • కాకతీయులవి ''దాయగజకేసరి'' అనే లేఖనం ఉన్న ప్రతాపరుద్రుని బంగారు నాణెం (ఇతర నాణేలు ఎక్కువగా దొరకలేదు)
 • కాకతీయ వరాహ చిహ్నం వున్న యాదవరాజుల వెండినాణేలు.
 • నాణేల వల్ల రాజులగుణాలు, రాజ్యవిస్తీర్ణం, మతాభినివేశము, ఆర్ధిక పరిస్థితులు తెలుసుకోవచ్చు.

నిర్మాణాలు

 1. రాక్షసగుళ్ళు: పెద్దరాళ్ళు అని అర్ధం. ఇవి సమాధులు. వీని నుంచి నాగరికతా స్వభావము, మత విశ్వాసాలు, ప్రజలు జాతీయత (అస్థికల నుండి) తెలుసుకోవచ్చు.
 2. బౌద్ధ నిర్మాణాలు : (క్రీ.శ 300 ప్రాంతం)
 3. చోళ, చాళుక్య యుగం నుండి దేవాలయాలలో చిత్రలేఖనం

శిల్పాలు, చిత్రాల నుండి నాటి గృహోపకరణాలు, కేశాలంకరణ, వస్త్రధారణ, సాంఘీక జీవితంలోని అంశాలైన వినోదాలు, వాద్యాలు, ఆయుధాలు ఇత్యాదుల గురించి తెలుసుకోవచ్చు. స్థూలంగా నిర్మాణాలు నాగరికతా పరిణామంలో భిన్న దశలు క్రమాన్ని వాటి స్వభావాన్ని తెలియజేస్తాయి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved