22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రపంచ కాలుష్యంలో అమెరికాదే పైచెయ్యి

కార్ల వినియోగం రోజు రోజుకి పెరగడమే దీనికి కారణం

ప్రపంచ జనాభాలో అమెరికన్లు ఐదు శాతం మంది మ్రాతమే. కానీ ప్రపంచంలో మూడో వందు కార్లను అమెరికన్లే నడుపుతున్నారు. ఫలితంగా చమురు వినియోగం ఇక్కడ విపరీతంగా ఉంది. తదనుగుణంగా కాలుష్యం కూడా అధికంగా వుంది (2006 గణాంకాల ఆధారంగా). ఏటా ప్రపంచంలో కార్బన్డయాక్సైడ్ విడుదలలో దాదాపు సగం అమెరికానుండే వెలువడుతోంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడంలో అమెరికా కార్ల పాత్ర గణనీయంగా ఉంది. అమెరికాలో చమురు వినియోగం నిరంతరం పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో 202 మిలియన్ల ప్యాసింజర్ వాహనాలు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 683 మిలయన్లు. ఒక్కో అమెరికా వాహనం ఏడాదికి సగటున 17,700 కిలోమీటర్లు తిరుగుతుంది. కార్ల వినియోగం అంతకంతకూ పెరిగిపోతున్నది. చమురు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో స్పోర్స్ట్ యుటిలిటీ వెహికల్స్(ఎస్ యు విలు)కు ఆదరణ పెరగుతోంది.

పెరుగుతున్న ఆదాయ వనరుల వల్ల భారత్ లో కూడా కార్ల వినియొగం పెరుగుతున్న నేపద్యంలో ప్ర్యావరణ కాలుశ్యం గురించిన అవగాహన అమెరికా వారికే కాదు, మన భరాతీయులకు కూడా అవసరమే.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved