22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఎయిడ్స్

ఒకప్పుడు పాశ్చాత్యుల రోగంగా పరిగణించబడిన ఎయిడ్స్ మహమ్మారి మన సమాజాన్ని కూడా కాటేసిందనేది సత్యం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి ఆందోళనకరంగా వుంది

ఎయిడ్స్ ఒక ప్రాణాంతకమైన, చికిత్సలేని సుఖ వ్యాధి. ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ (హెచ్.ఐ.వి.) ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ కారణంగా మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా క్షీణించి పోయి హెచ్.ఐ.వి. సోకిన వ్యక్తి వివిధ వ్యాధులకు గురవుతాడు. అటువంటి వాటిలో ప్రధానంగా క్షయ, న్యూమోనియాకు సంబంధించిన న్యూమోసిస్టస్ కార్నియో, చర్మం మీద కంతులుగా ఏర్పడే కాషాసిస్ సార్కొమా, హెర్పిస్, షింగిల్స్, క్రిప్టోస్నోరియాసిస్ వంటి అంటు వ్యాధులు కలుగుతాయి.

ఆఫ్రికా అడవుల్లోని చింపాంజీ నుండి ఎయిడ్స్ వ్యాధి సంక్రమించిదని శాస్త్రవేత్తల అభిప్రాయం. మొదటగా యూరప్లోను, తర్వాత అమెరికాలోను విచ్చల విడి లైంగిక సంబంధాల వల్ల వ్యాధి ఆవిర్భవించిందని భావిస్తున్నారు.

ఎయిడ్స్ మొదట 1981లో అమెరికాలో గుర్తించారు. రాబర్ట్ గాలో, లాక్మెంటాగైర్ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఎయిడ్స్ వైరస్ను కనుగొన్నారు. భారతదేశంలో మొదటిసారి హెచ్.ఐ.వి. కేసు 1986లో ముంబాయిలో నమోదయ్యింది. ప్రారంభంలో ముంబాయి, చెన్నైలలో సెక్స్ వర్కర్లు, మణిపూర్ రాష్ట్రాంలో మత్తు పదార్ధాలను ఉపయోగించే యువతలో ఎయిడ్స్ సోకిన కేసులు ఎక్కువగా కన్పించగా, ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎయిడ్స్ మహమ్మారి శీఘ్రంగా వ్యాపిస్తోంది. సెక్స్ వర్కర్లు, రెడ్ లైట్ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలలోనే ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలలో ఏటేటా అంచనాలకు మించి ఎయిడ్స్ వైరసులు పెరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో కేసులు అదుపు లేకుండా పెరుగుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలోను, ఆంధ్రపదేశ్ రెండవస్థానంలో, కర్నాటక మూడవ స్థానం, తమిళనాడు, నాగాలాండ్ లు నాల్గవ, ఐదవ స్థానాలలో ఉన్నాయి.

ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 1987లో జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1992లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్థాపించింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved