17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రవివర్మ కుంచకు అందని అందం లేదు

భారతదేశ చిత్రలేఖన రంగంలో ఒక చిరస్మరణీయ స్థానం ఏర్పర్చుకున్నారు రవివర్మ. స్త్రీ సౌందర్యావిష్కరణలో ఆయనకు ఆయనే సాటి.

'' రవి వర్మకే అందని ఒకే ఒక అందినివో'' అని సినీ కవీంద్రుడు ఓ అమ్మాయి గురించి వర్ణించిన పాట తెలియనివారు వుండక పోవచ్చు. అమ్మాయి అందాన్ని ఆ విధంగా వర్ణించడంలొనే రవి వర్మ ఎంతటి చిత్రకారుడో తెలుస్తుంది. ఏప్రిల్ 29, 1848లో కేరళ రాష్ట్రంలోని కిలిమనూర్ లో పుట్టిన ఆయన తన కుంచెతో వేవేల వర్ణాల అందాలను సృష్టించారు. దేశంలోని అరుదైన చిత్రకారునిగా రవివర్మను పేర్కొనవచ్చు. మహాభారతం, రామాయాణాల్లోని ఘట్టాలను అందమైన చిత్రాలు గీసిన అద్భుత కళాకారుడాయన, మన సాంప్రదాయాల మాటునే యూరోపియన్ స్టైల్ ను చొప్పించిన ఘనత ఆయన సొంతం. చీర కట్టుకునే స్త్రీ సౌందర్యావిష్కరణలో ఆయన చిత్రాలు ముందు వరుసలో నిలుస్తాయి. భారతదేశ చిత్రలేఖన చరిత్రలో ఆయన స్థానం చిరస్మరణీయం. ట్రావెంకోర్ మహారాజా పోషణలో 14 ఏళ్ళ వయసులోనే ప్యాలెస్లోని చిత్రకారుడు రామస్వామి నాయుడు వద్ద శిక్షణ పొందారు. ఆ తర్వాత బ్రిటీష్ చిత్రకారుడు థియోడర్ జెన్సన్ వద్ద తైల వర్ణ చిత్ర కళలో శిక్షణ పొందారు. 1873లో వియన్నాలో జరిగిన పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఆయనకు అవార్డు లభించింది. చిత్రలేఖనంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన అక్టోబర్ 1906లో మరణించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved