17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కాలంతో మారుతున్న దక్షిణాది నాట్య సంప్రదాయం

తమిళనాడులో బేబీ కమల, డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం, సుధారాణి రఘుపతి, చిత్రా విశ్వేశ్వరన్ ప్రముఖ నాట్యకళా విదుషీమణులు. కేరళలో వల్లతోల్ స్థాపించిన కళా మండపంలో గోపీనాథ తంగమని దపంతులు, మాధవన్ ప్రభృతులు ప్రఖ్యాతి చెందారు. కర్ణాటకలో తన ఎనభయ్యో ఏట ఈనాటికీ నాట్యకళ కోసం కృషి చేస్తున్న విదుషీమణీ శ్రీమతి వెంకట లక్ష్మమ్మను తలచుకోక తప్పదు.

ఈ రోజున పలు విశ్వవిద్యాలయాలలో నాట్య కళలో ఉన్నత విద్య, పరిశోధన, పి.హెచ్.డి.లు పొందే సౌకర్యం కొత్త తరాల కళాకారులకు అందుబాటులో ఉంది. హైదరాబాదులో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారవు ప్రోత్సాహంతో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడటం: ఆచార్య దొణప్ప, ఆచార్య నారాయణరెడ్డి వంటి సంస్కృతీవేత్తల కృషివల్ల ఇతర లలిత కళలతో పాటు నాట్యంలో మూడేళ్ళ డిగ్రీకోర్సు, రెండేళ్ళ పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సు, ఎం.ఫిల్., పి.హెచ్.డి. కోర్సులు ఏర్పడటం ముదావహం. ప్రాచీన నాట్యకళాసంపద సంప్రదాయాల్ని పరిరక్షించుకొంటూ కాలానుగుణ్యమైన భావాలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో కొత్త నాట్య ప్రదర్శనలను రూపొందించడం రానున్న తరాల కళాకారుల విధి. దానిని వారు నెరవేర్చుతారని ఆశిస్తున్నాను.

పేజి   123456 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved