22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

దక్షిణాది రాష్ట్రాల సినిమా సంబంధాలు

By మిక్కిలినేని, రాధాకృష్ణమూర్తి

దక్షిణాదిలో తెలుగు, తమిళ, కన్నడల మధ్య పరస్పర సంబంధాలు ఎన్నో సంవత్సరాలుగా వర్ధిల్లుతున్నాయి. డబ్బింగ్ సినిమాల జోరు పెరుగుతున్న ఈ తరుణంలో ఒకసారి సినీ పరిశ్రమ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అన్ని రంగాలలోనూ తెలుగు వారు ఎలా ముందుకు దూసుకుపోయారో ఆదర్శంగా కృషి చేశారో అలాగే నాటక సినిమా రంగాలలో కూడా కృషి చేశారు. ఆనాటి మన తెలుగు నాటకాలను, నటీనటుల సామర్ధ్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తూ వుండేవారు. అలాగే మన చలనచిత్రకళ దక్షిణాది రాష్ట్రాల వారికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ రకంగా ఆనాడు తెలుగువారు జాతీయ సమైక్యతకు ఎంత కృషి చేశారో అర్ధం చేసుకోవచ్చును.

ముఖ్యంగా తెలుగు చిత్రాలు ఉన్నత ప్రమాణంలో వుండి తమిళ, కన్నడ, మళయాళ ప్రజల ప్రశంసలందుకుంటూ వుండేవి. ఆంధ్రదేశంలో విజయవంతతమైన ప్రతి తెలుగు చిత్రమూ మద్రాసు నగరంలో నూరు రోజులకు తక్కువ నడిచేది కాదు. అలాగే దక్షిణాది భాషా రాష్ర్టాల ముఖ్య పట్టణాలలో కూడా నూరు రోజులు నడిచిన తెలుగు చిత్రాలున్నాయి. భాష తెలియకపోయినా తెలుగు చిత్రాల్ని అంతగా ఆదరించేవారు. వారి సొంత భాషా చిత్రంగా అభిమానించేవారు. మన చిత్రంలోని అభ్యుదయ దృక్పధాన్ని ఎంతో ఆదర్శంగా తీసుకునేవారు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ ప్రజల మధ్య ఏ రకమైన భాషాద్వేషాలు వుండేవి కావు. అందరిదీ జాతీయ దృక్పథం. అలా మన తెలుగు చిత్రకళ ఇతర భాషల ప్రజలకు నూతనోత్తేజాన్ని కలిగించింది.

తమిళ నిర్మాతలు - తెలుగు చిత్రాలు

సుప్రసిద్ధ తమిళ చిత్ర నిర్మాతలు తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో సేవ చేశారు. వారిని కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకోడం మన ధర్మం. జెమినీ పిక్చర్సు, యస్.యస్. వాసన్, యస్.యస్. బాలన్, సేలం మోడరన్ ధియేటర్స్ సుందరం, మెయ్యప్ప చెట్టియారు, ఎ.వి.యం., వాసూ, మీనన్, ఏ.యల్. శ్రీనివాసన్, జూపిటర్సు పిక్చర్సు, సోము, పక్షిరాజు శ్రీరాములునాయుడు, బి.ఆర్. పంతులు, కె.యం. నాగన్న, బి.యస్. రంగా -వీనస్ పిక్చర్సు, అశోకా మూవీస్ - శ్రీధర్, గౌండప్ప చెట్టియార్, విఠలాచార్య, కె. సుబ్రహ్మణ్యం, ఆర్.యం. కృష్ణస్వామి, రామన్న ఎ.కె. వేలన్, సౌందరరాజన్ మొదలయిన అనేక మంది ప్రసిద్ధ అన్యభాషా చిత్ర నిర్మాతలు ఎన్నో తెలుగు చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి తెలుగువారి చలన చిత్ర రంగానికి అకుంఠిత సేవలను అందించారు. తెలుగు సినిమా రంగం వారికి ఎంతో రుణపడి వుంది.

పేజి   1 |   234 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved