17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వరి విశేషాలు

ప్రపంచంలో సగానికి పైగా జనాభాకి ముఖ్య ఆహారమైన వరి పంట గురించిన పలు విషయాలు

ప్రపంచంలో సగానికి పైగా జనాభాకి ముఖ్య ఆహారం వరి ఇది ప్రపంచంలో రెండవ పెద్ద ధాన్యపు పంట. సుమారు 154 మి.హె.లో ప్రపంచవ్యాప్తంగా పండించబడుతోంది. సంవత్సరానికి సరాసరి 620 మి.ట ఉత్పత్తి జరుగుతోంది. వృక్ష శాస్త్రజ్ఞులకు ఒక గడ్డి యొక్క గ్రామీణ లేక పోకే కుటుంబానికి చెందినది, ఒరైజా జాతి) జనాళికి ఎంతో ప్రాముఖ్యమైన ఆహారం. వరి నుండి మినరల్సు ( ఖనిజాలు , విటమిన్లు, పీచుపదార్ధం, ముఖ్యంగా కార్బొహైడ్రేట్లు ( పిండిపదార్ధాలు) మరియు తక్కువ మోతాదులో పోషక విలువగల మాంసకృత్తులు (ప్రొటీన్) లభిస్తాయి.

ఆహార శక్తి అవసరాలలో 35% నుంచి 80% వరకు వరి నుంచి ప్రపంచ జనాభా పొందుతోంది. ఆసియా ఖండంలో 3 బియన్లు, ఆఫ్రికా ఖండంలో ఒక బిలియను ప్రజలకి ఆహారంలో శక్తి నిచ్చేది వరే. ఇది ప్రపంచ జనాభాలో 50% కంటే ఎక్కువ. అలాంటి వరి గురించి మరి కొన్ని అంశాలు

వరి రకాలు

వరిలో 4000 కంటే ఎక్కువ రకాలు మన భారతదేశంలోనే పండిస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇంకా అధికం.

వరి సాగు రకాలు

వరి సాగును ప్రాంతాలను, వాతావరణాన్ని బట్టి ఈ విధంగా విభజించవచ్చు

  1. సాగునీటి వనరులు కలిగినవి
  2. వర్షాధార ఎత్తైన ప్రదేశాలు
  3. పల్లపు ప్రదేశాలు
  4. ఉప్పునీటి ప్రదేశాలు

సాగునీటిపై ఆధారపడి పండే ప్రదేశాలలో పండించే రకాలు

సోనా, కృష్ణహంస ( త్వరగా కోతకు వచ్చే రకాలు)

విక్రమ్, అజుయ, ( మధ్యమ రకాలు) జయాతి, సుప్రియ, ఇందిర నవీన మొదలైనవి.

వర్షాధారపు ప్రాంతాలు వరి వంగడాలు

నాగార్జున, ఆదిత్య IET 7564 (ఐ.ఇ.టి. 7564) కళింగ-3, కళ్యాణి-2, సదాబహార్, హజారిధాన్ మొ।।
పేజి   1 |   23 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved