17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

జాతీయ రైతాంగ ఉద్యమం - ఆవిర్భావ వికాసాలు

మా ఆర్థిక సామాజిక వైఖరులు మహాత్మాగాంధీ, వీరేశలింగం, ఉన్నవల వైఖరులే. భిన్న కులాలవారు ఆర్థిక వృత్తుల ఆధారంగా సహకార సంస్థలుగా ఏర్పడి, తమ సామాజిక ఆర్థిక మెరుగుదలకు గిల్డు సోషలిజం ప్రాతిపదికగా సమైక్యంగా కృషి చేసేటట్టు ప్రజల్ని ఒప్పించాలన్న నా ప్రతిపాదనలను మా జిల్లాలోని కాంగ్రెసు నాయకులు అంగీకరించారు. రైతులకు కనీస ధరలు, కార్మికులకు కనీస వేతనాలు సాధించేందుకు పార్టీ పనిచేయాలి. ఈ విధమైన కార్యక్రమాన్ని రూపొందించి ఒక వేదికను ఆవిష్కరించేందుకు రైతుల మహాసభ ఒక దానిని, స్కూలులో నా సహ విద్యార్థి ఆచంట నాగయ్య తోడ్పాటుతో, అప్పికట్లలో మేం నిర్వహించాం. భారతదేశం మొత్తంమీద ఇలాంటి మహాసభ జరగటం ఇదే ప్రథమం.

ఎన్నికలలో గెలుపు సాధించిన వెంటనే మా స్వగ్రామం నిడుబ్రోలులో వ్యవసాయ కార్మికుల మొదటి మహాసభను మేం నిర్వహించాం. రాజకీయంగా చైతన్యవంతులు అవుతూ, ఒక శక్తిగా ఆవిర్భవిస్తున్న ఆది ఆంధ్రులనూ, తదితర కార్మికులనూ కాంగ్రెసు వెనుక సమీకరించే దృష్టితో ఈ సభను నిర్వహించాం. అయితే ఆది ఆంధ్రులలోని చదువుకున్న వారిలో అత్యధికులు క్రిష్టియన్ మిషనరీల బలమైన ప్రభావాల కింద ఉండటంవల్ల ఈ సమావేశానికి హాజరైన కార్మికులలో చీలికలు సృష్టించారు.

గ్రామీణ కార్మికులలో ట్రేడ్ యూనియన్ భావాలు అభివృద్ధి పరచాలన్న నా ఆశ ఆ విధంగా భగ్నమైంది. అయితే ఇళ్ళ స్థలాలు, గ్రామీణ కార్మికులకు ఇళ్ళ నిర్మానానికి సహాయం డిమాండ్ చేయాలన్న నా ప్రతిపాదనను అందరూ హర్షించారు. అయితే స్వరాజ్యం ఇవ్వాలనే డిమాండ్కూ, జాతీయ కాంగ్రెసుకి తోడ్పాటు విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. మా జిల్లాలోని వ్యవసాయ కార్మికులలో అత్యల్ప సంఖ్యాకుల తోడ్పాటు కూడా ఈ మహాసభ పొందలేకపోయింది. వ్యవసాయ కార్మికులు తమ మానసిక హైన్యతా భావం నుంచి బైట పడటానికి సిద్ధంగా లేరని, అగ్రకుల రైతుల దాడులు ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతున్నారి, స్వశక్తీ ఆర్గనైజేషన్ల కృషి ఆవశ్యకతను వారు ఇంకా గుర్తించలేదని బ్రిటీష్ అనుకూల విధేయులైన క్రిష్టియన్లతో పాటు ఈ విధమైన ఆలోచనలు కూడా ఉన్నాయని నేను గమనించాను.

పేజి   12 |   3456 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved