22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు సినిమా మచ్చుతునకలు

By ఇంటూరి, వెంకటేశ్వరరావు

తెలుగు సినిమాకు ఖ్యాతి తెచ్చిపెట్టిన సినిమాల జాబితా

ఇన్నాళ్ళ తెలుగు సినిమాల్లొ పేరు తెచ్చుకున్న120 సెల్యులాయిడ్ కావ్యాలు:

1.భక్త ప్రహ్లాద 2. లవకుశ 3. సీతాకల్యాణం 4. శ్రీ కృష్ణ లీలలు
5. ద్రౌపది వస్త్రాపహరణం 6. బాలయోగి 7. మాలపిల్ల 8. గృహలక్ష్మి
9. శ్రీ వెంకటేశ్వర మహాత్యం 10. వందేమాతరం 11.రైతుబిడ్డ 12. మహాత్మాగాంధి (డ్యాకుమెంటరీ చిత్రం)
13. భక్త పోతన 14. జెమినీ బాలనాగమ్మ 15. పత్ని 16.పంతులమ్మ
17. మాయాలోకం 18. స్వర్గసీమ 19. త్యాగయ్య 20. సారధివారి పల్నాటి యుద్ధం
21. యోగి వేమన 22. మనదేశం 23. శోభనాచలవారి ''లక్ష్మమ్మ'' 24. సంసారం
25. దీక్ష 26. మల్లీశ్వరి 27. పల్లెటూరు 28. దేవదాసు
29. పుట్టిల్లు 30. పెద్ద మనుషులు 31. రోజులు మారాయి 32. సువర్ణ సుందరి
33. నమ్మినబంటు 34. మహాకవి కాలిదాసు 35. భక్త శబరి 36. బాటసారి
37. డాక్టరు చక్రవర్తి 38. మహామంత్రి తిమ్మరుసు 39. నర్తనశాల 40. భక్తరామదాసు
41. తేనె మనసులు 42. నవరాత్రి 43. సాక్షి 44.సుడిగుండాలు
45. ఏకలవ్య 46. నిమజ్ఞనం 47. జైజవాన్ 48. కథానాయకి మొల్ల
49. శ్రీ కృష్ణసత్య 50. బాలభారతం 51. సంపూర్ణ రామాయణం 52. తాతా మనుమడు
53. అల్లూరి సీతారామరాజు 54. గాంధీ పుట్టిన దేశం 55. జీవన తరంగాలు 56. భక్త తుకారం
57. ముత్యాల ముగ్గు 58. మహాకవి క్షేత్రయ్య 59. అమెరికా అమ్మాయి 60. ముద్దబంతి పువ్వు
61. సిరిసిరి మువ్వ 62. ఎన్.ఎ.టి. వారి సీతాకల్యాణం 63. దాన వీర శూర ర్ణ 64. కరుణామయుడు
65. మనవూరి పాండవులు 66. తాయారమ్మ - బంగారయ్య 67. గోరింటాకు 68. కలియుగ భారతం
69. హరిశ్చంద్రుడు 70. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ మహిమ 71. ఊరుమ్మడి బ్రతుకులు 72. ప్రెసిడెంటు పేరమ్మ
73.ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య 74. ముద్దమందారం 75. ప్రేమాభిషేకం 76. సీతాకోక చిలుక
77. మేఘసందేశం 78. ఎం.ఎల్.ఎ. ఏడుకొండలు 79. రెండు జడల సీత 80. ఆంధ్రకేసరి
81. ముక్కుపుడక 82. స్వరాజ్యం 83. బొబ్బిలి బ్రహ్మన్న 84. కురుక్షేత్రంలో సీత
85. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 86. ప్రతిఘటన 87. స్వాతిముత్యం 88. దానవుడు - మానవుడు
89. శంకరాభరణం 90. నా పిలుపే ప్రభంజనం 91. సిరివెన్నెల 92. సప్తపది
93. నేటి భారతం 94. సమాజంలో స్త్రీ 95. ధర్మపీఠం దద్దరిల్లింది 96. శ్రావణ మేఘాలు
97. పసుపుతాడు 98. సంసారం ఓ చదరంగం 99. పడమటి సంధ్యారాగం 100. శృతిలయలు
101. న్యాయానికి సంకెళ్లు 102. పుష్పక విమానం 103. అగ్ని పుష్పం 104. జస్టిస్ రుద్రమదేవి
105. శివ 106. చట్టానికి కళ్లులేవు 107. నాయకురాలు 108. మా యింటి కథ
109. పుట్టింటి పట్టుచీర 110. అంకుశం 111. కర్తవ్యం 112. ఇంటింట దీపావళి
113. ఆడది 114. ప్రేమయుద్ధం 115. మనసు - మమత 116. మౌన పోరాటం
117 జరగదేవీరుడు - అతిలోక సుందరి 1 18 మామాశ్రీ 119 అల్లుడుగారు 120. మట్టి మనుషులు.

వీటిల్లో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ శిల్పంలో కానీ సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంలో కానీ తెలుగు సినిమా ఏఏ పరిణామ దశలకు గురి అయ్యిందో విశదం చేస్తాయి. చిత్ర నిర్మాణం సమిష్టి కృషి కావడం చేత నేను పైన పేర్కొన్న చిత్రాలలో పాల్గన్న ప్రతి వ్యక్తికీ ప్రశంశా పత్రం ముట్టక తప్పదు.

సాంకేతిక శాస్త్ర రీత్యా తెలుగు సినిమా కాలంతో కాలాడిస్తోందని చెప్పక తప్పదు. వేగం, ఉద్వేగం ప్రతి చిత్రంలోనూ '' ఫస్టు షాటు నుంచి ఫైనల్ ఫేడ్ అవుట్'' వరకు ద్యోతకం అవుతున్నాయని చెప్పవలసి ఉంటుంది.

తెలుగు సినిమా పరిణామ దశలకు మూడు వర్గాలవారు సంపూర్ణమయిన బాధ్యతను వహించక తప్పదు. ఆ వర్గాలవారు ఎవరంటే 1. ప్రభుత్వ పెద్దలు. 2. చిత్ర నిర్మాతలు. 3. ప్రేక్షకులు.

సంఘం యొక్క సర్వతోముఖ వికాసాన్ని ఈ మూడు వర్గాలు కాంక్షించే పక్షంలో సినిమా రూపురేఖలు కళాత్మకంగా వుండి '' సర్వేజనా సుఖినోభవంతు'' అన్న నినాదాన్ని మారుమ్రోగించ గలుగుతాయని నా వాదన.

- సినిమా పాత్రికేయులలో భీష్ముడని అందరి గౌరవాన్ని పొందిన ఈ వ్యాస రచయిత స్వాతంత్ర్య యోధులు. ఆనాటి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ముఖ్యులలో ఒకరు.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved