17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారతీయ సినిమాకి తెలుగు బీజం

మోదటి తెలుగు సినిమాలు

తన కొడుకు శ్రీ ప్రకాశ్ ను హాలీవుడ్ కు సినిమా శాంకేతిక శాస్త్ర అధ్యయనం కోసం పంపి, ఆయన తిరిగి వచ్చాక మద్రాసులోని పరసువాకంలో తాను నెలకొల్పిన గ్లాస్ స్టూడియోలో - స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిల్మ్ అన్న ఒక సంస్థ పతాకం మీద కొడుకు సహాయంతో వెంకయ్య '' గజేంద్ర మోక్షం'', '' మత్స్యావతారం'', ''నందనార్'', '' భీష్మ ప్రతిజ్ఞ'' మొదలయిన పొట్టి చిత్రాలను ( రెండు వేల అడుగుల పొడవు కలపి) నిర్మించాడు. ఈ చిత్రాలు అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో వెంకయ్య తన కష్టార్జితమయిన కొన్ని వేల రూపాయలను పోగొట్టుకున్నాడు.

సి. పుల్లయ్య, వై.పి.రావ్ మొదలయిన వారంతా శ్రీ ప్రకాశ్ కింద పనిచేసి, సినిమా సాంకేతిక శాస్ర్తాన్ని అవగాహన చేసుకుని, తెలుగు సినిమా పారిశ్రామిక రంగంలో నిర్మాతలుగానూ, దర్శకులుగాను రూపుదాల్చి చరిత్రను సృష్టించారు.

పోతిన శ్రీనివాసరావు, మోతే నారాయణరావు, జి.కె. మంగరాజు మొదలయిన వారంతా వెంకయ్య సలహాలతో తెలుగు దేశంలోని వివిధ పట్టణాలలో సినిమా ప్రదర్శన శాలలు నెలకొల్పారు. తాను నాటిన బీజం మహా వృక్షమై, వేలమంది కార్మికులకు ఆశ్రమయిస్తూంటే చూచి, ఆత్మ తృప్తినొందిన వెంకయ్య 1941 జూలై 1వ తేదీన మద్రాసులో శాశ్వతంగా కన్ను మూశాడు.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved