17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కుచిపూడి శైలి నిర్మాత శ్రీ సిద్ధేంద్ర యోగి

సిద్దప్ప నాయకత్వంలో వారు ఊరూర తిరిగి నృత్య ప్రదర్శనలిచ్చారు. వారిని కుశీలులని పిలిచేవారు. నాటక కులములకు ప్రాతినిధ్యం వహించే సంస్కృత పదం ' కుశీలవ' నుంచి ఈ పదం పుట్టింది. గ్రామంలో కొందరు బ్రాహ్మణులు దీనికి అభ్యంతరం చెప్పారు. వారిని హీనంగా చూసేవారు. ఆవేదనతో సిద్దేంద్రుడు ఆ బ్రాహ్మణ కళాకారులకు ఊరి పొలిమేరల్లోని బంజర్లలో నివాసం కల్పించాడు. అదే 'కుచీలపురి' గ్రామమై ఆ తరువాత 'కూచిపూడి'గా నామాంతరం చెందింది. ఆ గ్రామంలో మొదట స్థిరపడిన కుటుంబా లవంశీయులే ఇప్పటికీ వున్నారు. సిద్దేంద్రయోగి పెట్టిన నియమాల్ని వారు యిప్పటికీ పాటిస్తున్నారు. నృత్యానికి అనువుగా శరీరాన్ని మలిచేందుకు వ్యాయామంతోబాటు సంస్కృతధ్యాయనం, సంగీతం వారు అభ్యసిస్తుంటారు.

14వ శతాబ్ధంలో ప్రాచుర్యంలో ఉన్న భాగవతమేల నాటక పద్దతికి భిన్నమైన నృత్యరూపాన్ని జానపద యక్షగాన పద్ధతిలో రూపుదిద్దిన మహాకళాకారుడు సిద్దేంద్రయోగి. శివారాధనకు అంకితమైన నాట్యమేల నాటక పద్దతినుంచి పుట్టింది. భాగవతమేల నాటక పద్ధతి. ప్రవేశదరువు, జతులు వంటి పద్ధతులు ప్రవేశపెట్టి నృత్యానికి అనువుగా దాన్ని సిద్దేంద్రుడు తీర్చిదిద్దాడు. జానపద రూపాన్ని శాస్త్ర పద్ధతిలో సమ్మేళన పర్చాడు. కూచిపూడి శైలికి పితామహుడు ఆయనే.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved