17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కుచిపూడి శైలి నిర్మాత శ్రీ సిద్ధేంద్ర యోగి

By వెంపటి, చినసత్యం

కూచిపూడి నృత్య శైలికి నిర్మాత, భామాకలాపం యక్షగానాన్ని అందించిన శ్రీ సిద్ధేంద్ర యోగి జీవిత విశేషాలు

14వ శతాబ్ధం నాటికి శ్రీకాకుళ ప్రాంతంలో కళింగరాజుల పాలనలో కృష్ణభక్తి పరాకాష్టనందుకొంది. ప్రజల మనసులు, నృత్యాలు కూడా అలా నీలమేఘచ్ఛాయుడికి అంకితమై పోయిన వాతావరణంలో జన్మించాడు సిద్ధప్ప. అతడు అనాథ. అయితే బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడని గ్రామస్తులకు తెలుసు. ఒక సంపన్నుడు అతడికి ఉపనయనం చేయించాడు. ఆ తరువాత వివాహం కూడా జరిగింది కాని ఆ బాలకన్య ఎవరో అతడికి గుర్తే లేదు. సిద్దప్ప రేయింబవళ్ళు నృత్యంలోనే గడిపేవాడు.

ఉడిపి మఠానికి నరహరితీర్ధులు అధిపతిగా ఉన్న ఆ రోజుల్లో శ్రీకాకుళంలో కూడా ఒక చిన్న మఠం నెలకొల్పారు. ఈ మఠంలోనే గడిపే సిద్ధప్ప కృష్ణభక్తి పారవశ్యాన్ని చూసి మఠాధిపతి అతడిని ఉడిపికి పంపించారు. ఉడిపిలో ఇరవైయేళ్లు అధ్యయనం చేసి నాట్యంలో నిష్ణాతుడయ్యాడు సిద్దప్ప. అతడి ప్రతి కదలికా నాట్యముద్రగా ఉండేది. గానంలో గంధర్వుడు. పైగా గొప్ప అందగాడు. శ్రీకాకుళానికి నృత్య పండితుడుగా తిరిగి వచ్చాడు సిద్దప్ప. ముందు ఎవరూ గుర్తించలేదు. తరువాత అతడే సిద్దప్పని తెలిసింది. కృష్ణానదికి అవతలిగట్టున ఉన్న మామగారికీ విషయం తెలసింది. తన యింటికి ఆహ్వానించగా సిద్దప్ప అంగీకరించాడు. అయితే దారిలో కృష్ణానది ఈదుతుండగా ప్రళయమైన తుఫాను వచ్చింది. మరణం తధ్యమని నిర్ణయించుకొని ఆతుర సన్యాసం పుచ్చుకొన్నాడు. సురక్షితంగా అవతలిగట్టు చేరి అత్తగారింటికి వెళ్ళాడు. సన్యాసం సంగతి మర్చిపోయి భార్య దగ్గరకు వెళ్ళాడు. ఆమెకతడు కాషాయాంబరధారిగా కనిపించాడు. నువు సన్యాసివి అని కేకపెట్టి మూర్చబోయింది. అప్పుడు తన సన్యాస ప్రతిజ్ఞ గుర్తుకొచ్చింది. కృష్ణభక్తిలో తన్మయత్వం చెందాడడ. సత్యభామ ప్రేమతత్వం గ్రహించాడు. అలా సర్వసంగ పరిత్యాగి అయాడు. సిద్దేంద్రయోగి అయాడు. మధురభక్తి ప్రచారకుడయాడు. భామాకలాప సృష్టికర్త అయ్యాడు.

శ్రీకాకుళం, ఘంటసాలల్లోని దేవదాసీలు, రాజనర్తకీమణులు భామాకలాపం నేర్చుకోవాలని ఎంతో ఆతురతతో ప్రయత్నించారు. శృంగార రసపోషణలో అప్పటికే ఝాణలైన అలాటివారు గనుక వీటిని నేర్చితే ఆ నోభావాలను అతిగా ప్రదర్శించి వాటిలోని ఆధ్యాత్మిక కళా సౌందర్యాన్ని అపభ్రంశం చేస్తారేమోనని సిద్దేంద్రయోగి భయపడ్డాడు. అదువల్ల అందంగా ఉన్న బ్రాహ్మణ యువకులకే ఈ కళ నేర్పాలని నిర్ణయించుకొన్నాడు. భామాకలాపం వారికి నేర్పాడు. ప్రతి కుటుంబంలోను ఒక మగ శిశువును నృత్యసంగీత కళలకి అంకితం చేస్తామని కొద్ది కుటుంబాలు ప్రతిజ్ఞ పూనాయి. పుట్టిన మగశిశువు మొలక కట్టే చిన్నగంట దానికి సంకేతంగా ఉంటుంది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved