17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కూచిపూడి నృత్యం - ఆవిర్భావ వికాసం వివరాలు

ప్రభుత్వ నిర్లక్షం

కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ ఒక పర్యాయం ఒక ఫోటోని కూచిపూడి అనే శీర్షిక కింద ప్రచురించింది. కూచిపూడి శైలితో ఎలాంటి సంబంధం లేని ఫోటో అది. ఆ పొరబాటను ఆనాడు ఎవరూ సరిదిద్దకపోవడం విచారకరం. నాట్యవేత్తలుగాని, నృత్యాన్ని వృత్తిగా స్వీకరించినవారుగానీ, ప్రబుత్వంగానీ ఎవరూ దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించలేదు. కూచిపూడిని అసలు చాలా కాలంపాటు శాస్త్రీయ నృత్యంగా పరిగణించలేదు. కొందరైతే దాన్ని ' వీధి గెంతులు'గా కొట్టి పారేశారు. వీధి నాటకం అనే వర్గీకరణ వారు అంత బాగా అర్ధం చేసుకొన్నారు.

యక్షగానం అనే పూర్వపు జానపద నాటక పద్ధతి నుంచి కూచిపూడి నాట్యం ఒక కళగా అభివృద్ధి చెందిందని కొందరు విమర్శకులు పొరబాటుగా అర్ధం చేసుకొన్నారు. ఇది సరికాదు. పాటలోగాని, నృత్యంలోని, అభినయంలోగాని, ముద్రలు, పాదాల విన్యాసం, భావ ప్రకటనల్లోగాని జానపద రేఖలు ఏ మాత్రము కూచిపూడిలో కానరావు. ఆయా కాలాల్లో ఆయా గురువుల పద్ధతిలో ఒక్కో చోట ఒక్కోలా ప్రమాణాలలో తేడాలుండవచ్చు. అయితే ఆత్మ మాత్రం ఒక్కటే. భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన శాస్త్రీయ నృత్యాలలో ఒకటిగా కూచిపూడి నాట్యాన్ని పేర్కొనవచ్చు. కూచిపూడి నృత్య నాటకాలలో వినియోగించే సంగీతం ఖచ్చితంగా శాస్త్రీయ సంగీతమే.

పెద్దల కృషి

1950లలో కీర్తిశేషులైన వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రిగారు కృషివల్లనే కూచిపూడికి ఈనాడు ఈగౌరవం లభించిందని చెప్పుకోవాలి. ఆయన విజ్ఞాన ఖని. సంప్రదాయంలో మౌలికంగా మార్పు తెచ్చి స్త్రీలకు ఈ కళను ఆయన నేర్పారు. భరత నాట్య ప్రవీణురాలైన బాలసరస్వతి వారివద్ద కూచిపూడిని అభ్యసించారు. ఒక కొత్త కళా సౌందర్య జగత్తును ఆయన తన కళ్ళముందు సాక్షాత్కరింప చేశారని ఆమె నాడు ప్రకటించారు.

ఈ మహత్తర నాట్యశైలి విశిష్టతను ప్రపంచానికికంతకీ చాటాలన్నది నా జీవితాశయంగా ఎంచుకొన్నాను. ఈ నాట్యశైలిలో గర్భితమైన సౌకుమార్యత, గాంభీర్యతను నేర్చుకోవడానికి ఎంత మంది స్త్రీలు ముందుకొస్తే అంత మంచిదని నా అభిప్రాయం. ఒకప్పుడు పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు వాడే తెర/కాగడాలు వంటి వాటికి ఇప్పుడు అవసరం లేదు. అదునాతన సాంకేతిక సౌకర్యాలు గల ఈ కాలంలో ఇంకా వాటిని కొనసాగించడం చాదస్తం అవుతుందని నేను భావిస్తున్నాను.

మారుతున్న కాలాన్ని బట్టి సౌందర్య భావనా గ్రహణలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా తనను తాను మలచుకోవడం ఏ కళకైనా అవసరం. ఈ దృష్టితోనే వేదాంతం లక్ష్మీనారాయణగారు స్త్రీలకు ఈ విద్యలో శిక్షణ ఇచ్చారు. ఈ రోజు స్త్రీలు పురుష ప్రాతలు కూడా ధరిస్తున్నారు. సంగీతంలాగే నృత్యానికి కూడా ఎల్లలు లేవు. భాషా అవరోధాలు లేవు. జాతిపర వేర్పాటులు లేవు. కళముందు అన్ని గోడలూ కూలిపోక తప్పదు. సమైక్యం చేసే మహత్తర శక్తి కళ.

పేజి   123 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved