17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కూచిపూడి నాట్య సంగీతం-సాహిత్య రచన

కుచిపూడికి సోదరి - భరతనాట్యంలో సాహిత్యం

భరతశ్రేష్ఠుడు తంజావూరి శ్రీ పొన్నయ్య పిళ్లె గొప్ప సంగీత విద్యాంసుడు కూడా. శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వీరి శిష్యుడు. అయినా, ఆయన సోదరులు - వీరే ఈనాడు భరతనాట్యం అని పిలువబడే నాట్యశైలికి మూలపరుషులు. నాయకా నాయకీ భావానుగుణ్యమైన శృంగార రచనలు అత్యంత ప్రౌఢ మార్గంలో రచించారు. ముఖ్యంగా భరతనాట్యంలో ప్రధాన అంశమైన 'పదవర్ణనం' తంజావూరు సోదరుల నిర్మాణం. అంతేగాదు అలరిప్ప, జతిస్వరం, వర్ణం, తిల్లానా, జావళి మొదలయిన అంశాలు భరతనాట్యంలో సొంతం చేసుకోబడ్డాయి. పూర్వపు సంగీత రచనలను భరతనాట్యం పూర్తిగా ఏమీ విస్మరించలేదు. కౌత్వం శబ్ధం యథోచితమైన స్థానంలోనే వున్నాయి. నాట్యంలోనూ సంగీతంలోనూ గల ఉన్నత ప్రమాణాలు భరతనాట్య విజయానికి కారణం.

ఒకవిధంగా కూచిపూడి, భరతనాట్యం కవలపిల్లలాటివి. ఈ రెండు విధానాలు ప్రయోగించిన సంగీతం ఒకే సంప్రదాయానికి చెందినదే. చాలా అంశాలు - పదం, జావళి, పదవర్ణం- తెలుగు భాషలోనే రచించబడ్డాయి. కౌత్వం, శబ్దం మొదలయినవి ఈ రెండు సంప్రదాయాలకు ఉమమడి ఆస్తి. ఈ కారణాలవల్లనే చాలామంది కూచిపూడి నాట్యానికి భరతనాట్యానికి విడివిడిగా గల ప్రత్యేకతలను గుర్తించడానికి తికమక పడతారు. ఆహార్యంలోను, నాట్యాంశాలలోను, నట్యముద్రల ప్రయోగంలోను ఒక ప్రత్యేకశైలిని కూచిపూడి నాట్యంలో రసజ్ఞులు గ్రహించగలరు.

శొల్లుకట్టు

అంతేకాదు శొల్లుకట్టు కూడా ఈ సంప్రదాయ విశిష్టతకు తార్కాణం. కథక్, మణిపురి, భరతనాట్యం, కథాకళి మొదలయిన నాట్య సంప్రదాయాలకు శొల్లుకట్టులో ప్రత్యేకత గోచరిస్తుంది. కూచిపూడి నాట్యరీతులలో కూడా ప్రత్యేకశైలి వుంది. ఈ జతిని పరిశీలించండి.

తాంగుడు తూంగా ధిక్కితక్క

దిన్నఝేకుడఝేకుడు కిటతక।।

ఝేంతారీ కుందారీ కుకు

జగాకి ణకుధీ।।

తా।। తై।। తత్తహత్త।తై తై।।

తాంతాం దురుగుడుతాం। తనెంకిట । కిటధరి।।

కిటధిమి కిటదిం।। తకదదిగిణత।।

కిటధిమి కిటధిం।।తకధిమి గిణత

కిటధమి కిటధీ।। తరికిటదెం తరికటదెం తరికిట

శ్రీ నారాయన తీర్థులవారి తరంగాల జతులలో ఈ విధమైన జతుల నుడికారం కనిపిస్తుంది.

ఏ నాట్య సంప్రదాయమైనా సలక్షణమైన నాట్య సంగీతములు సక్రమమైన సరసమైన సమన్వయం సాధించినపుడే ఆ నాట్య విశిష్టత ఉత్తమ రసికులచేత గుర్తింపబడుతుంది. ఈ పరిస్థితులను సింహావలోకనం చేసుకుని నాట్యధర్మిని విస్మరించకుండా, సంగీత సాహిత్యములలో ఉత్తమ ప్రమాణాలను కాదనకుండా, కూచిపూడి నాట్యాచార్యుడు మాన్యులు కళాప్రపూర్ణులు వెంపటి చినసత్యంగారు తమ నాట్య రూపాలను నిర్మిస్తూవున్నారు. వారు నిర్మించిన నాట్యరూపాలకుప్రత్యేక పరామర్శ అవసరం.

పేజి   123 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved