17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగునాట హరిత విప్లవం

By సి, రాజేశ్వర రావు

1960 దశకంలో దేశవ్యాప్తంగా జరిగిన హరిత విప్లవం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభావం చూపింది. వ్యవసాయ రంగం అభివ్రుధి చెందినప్పటికి అది ప్రాంతీయ అసమానతలకు దారితీసింది.హరిత విప్లవ వివరాలు

హరిత విప్లవం

ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ రంగంలో భూసంబంధ పోరాటాలు చిరస్మరణీయమైన ప్రధమ అధ్యాయంగా ఉంది. ఇందులో నుండే వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయ విస్తరణ, బహుముఖ వ్యవసాయం, ఉత్పత్తి - ఉత్పాదకాల పెరగుదల అధ్యాయం జన్మిస్తుంది. 1956 నుండి 1966 వరకూ హరిత విప్లవానికి పూర్వదశగా గుర్తించవచ్చు. 1967 నుండి 1976 వరకూ హరిత విప్లవ దశగా పరగణించవచ్చు. 1977 నుండి 1985 వరకు హరిత విప్లవానంతర దశగా గమనించవచ్చు. ఈ మూడు దశలూ కలిపి అంటే 1956 నుండి 1985 వరకు 30 సంవత్సరములు వ్యవసాయ ప్రగతిని సమీక్షించుకోవచ్చు.

భారత దేశంలో 60వ దశకం మధ్యభాగంలో ప్రారంభమయిన హరిత విప్లవం పంజాబు హర్యానా, పశ్చిమ యు.పి. ప్రాంతాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ప్రభావితం చేసింది. ఆంధ్రదేశం ఈ హరిత విప్లవ ప్రభావంలో క్రమక్రమంగా చేరుకున్నది. సాంప్రదాయ సిద్ధమయిన వ్యవసాయ పద్ధతుల స్థానే ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టడమే హరిత విప్లవ ముఖ్య పరిణామమం. మేలు రకం విత్తనాలు , ఎరువులు, క్రిమి సంహారిక మందుల వాడకం, నీటి పారుదలను క్రమబద్ధం చేయడం, ఈ వ్యవసాయంలోని కొత్తదనానికి ముక్యాంశాలు. దీనితోపాటు రవాణా, మార్కెట్టు తదితర ప్రాతిపదిక సౌకర్యాలు కూడా ఈ సాంకేతిక మార్పులతో కూడిన వ్యవసాయానికి తోడ్పడినవి. ఈ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలోని ముఖ్యమయిన పంటలు తమ సహజ పరిమితులను దాటి ముందంజ వేసినవి. సగటు ఉత్పత్తి పెరగడమే గాక ప్రతి ఎకరం దిగుబడి గూడా గణనీయంగా పెరిగింది. హరిత విప్లవానికి తోడునీడగా అగుపించే ప్రభావం ప్రాంతీయ అసమానతలు. ఒక ప్రాంతం వేగంగా ముందంజ వేస్తే హరిత విప్లవ ప్రాతిపదిక సౌకర్యాలకు కనీస సౌకర్యాలకు నోచుకోని వెనుకబడిన ప్రాంతాలు వెనకనే వుండిపోయినవి. ఈ అసమానతలను సరిచేయడం ఒక ప్రధాన రాజకీయ సాంఘిక కర్తవ్యంగా ముందుకు వచ్చింది.

తీరని సమస్యలు

అన్ని పంటలు, ఆహార వాణిజ్య పంటలు హరిత విప్లవ కాలంలో గణనీయంగా పెరిగాయి. ఐనా ఈ పెరుగుదల రేటు తరువాతి కాలంలో తగ్గుముఖం పట్టింది. వరి పంటను మినహాయిస్తే, ఇతర పంటలలో పెద్ద ముందంజ కనబడటంలేదు. సరికదా ఉత్పాదకత రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. హరిత విప్లవ ఫలితంగా మెట్ట పంటలపై ఆధారపడే రాయలసీమలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చెప్పుకోదగిన మార్పు లేదు. ఇక్కడ వ్యవసాయ వ్యూహంలోనే మౌలికమయిన మార్పును తెచ్చి ఊట చెరువులు, ఆనకట్టలు మొదలగు కట్టడాల ద్వారా అనావృష్టిని ఎదిరించగలగాలి. సాంకేతిక పరమైన మెట్ట సేద్యం ద్వారా ఉత్పత్తి ఇనుమడించాలి. ఈ విధంగా ఉత్పత్తిలో ప్రాంతీయ అసమానతలను తగ్గించాలి. హరిత విప్లవానికి కారణభూతమైన మేలురకపు విత్తనాలు, మంచి ఎరువులు, క్రిమి సంహారక మందులు, నీటి వనరులు, పరపతి సౌకర్యాలు, రవాణా, మార్కెట్టు సదుపాయాలు, గిట్టుబాటు ధరలు ఉన్నప్పుడే సత్పలితాలు లభిస్తాయి. ఈ ఫలితాలు నిలకడగా వుంటాయి. వ్యవసాయం చేసే సామాన్య రైతాంగం ఆర్ధిక సౌష్టవానికి దోహదం చేస్తాయి. ఏది ఏమైన ఆవ్యవసాయ ఉత్పత్తి విలువ రాష్ట్రంలో 1956-57లో అప్పటి ధరల ప్రకారం 380 కోట్ల రూపాయలు ఉండగా 1987-88 నాటికి ఈ విలువ పెరిగి 6290 కోట్ల రూపాయలకు చేరుకున్నది. ఈ కాలంలో తగ్గిన రూపాయ విలువను దృష్టిలో వుంచుకున్నప్పటికీ ఈ పంటల విలువ పెరుగుదలలో గొప్ప మార్పు స్పష్టమౌతోంది. రాష్ట్రంలోని 70 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతూండగా రాష్ట్ర ఆదాయంలోని 38 శాతం వ్యవసాయం ద్వారా పొందగలుగుతున్నాం.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved