22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారతదేశంలో పంటల ఋతువులు

వివిధ ప్రాంతాలలో పంటల నాటడానికి రైతులు సంవత్సర కాలాన్ని భాగాలుగా విభజించారు.ఆ పంటల ఋతువుల విత్తుకాలం కోత కాలం వివరాలు

ఖరీఫ్

నైరుతి ఋతుపవనాల రాకతో ఈ ఋతువు ప్రారంభమయి, నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో ముగుస్తుంది. జొన్న, వరి, మొక్కజొన్న, జనుము, పత్తి, వేరుశనగ, చెరకు మొదలగునవి ప్రధాన పంటలు. ఖరీఫ్ కాలంలో సాధారణంగా జూన్ నెలలో పంటలు వేసి సెప్టెంబర -అక్టోబర్ నాటికి పంటలను తీస్తారు.

రబీ

అక్టోబర్ - డిసెంబర్ కాలంలో పంట వేయడంతో ఈ ఋతువు ప్రారంభమయి ఫిబ్రవరి - ఏఫ్రిల్ మాసంలో పంటలు కోతతో పూర్తవుతుంది. సాధారణంగా పంటలు వేయు కాలంలో శీతల వాతావరణం ఉంటుంది. పంటలు కోతకు వచ్చే కాలానికి దైనిక ఉష్ణోగ్రత పెరుగుతుంది. గోధుమ, బార్లీ, శనగలు, ఉలవలు, ఆవాలు ఈ ఋతువులలో ప్రధాన పంటలు.

జైద్

నీటిపారుదల వ్యవస్థ ఉన్న ప్రాంతాలలో సంవత్సరం పొడవున పండించే పంటలను జైద్ కాలపు పంటలు అంటారు. జైద్ ఖరీఫ్ కాలంలో వరి, మొక్కజొన్న, పత్తి, నూనె గింజల పంటలు ప్రధానమైనవి. జైద్రబీలో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved